బదిలీలు పొందిన ముగ్గురు ఉద్యోగులకు ఏపీఐఐసీ ఘన వీడ్కోలు


అమరావతి (ప్రజా అమరావతి);


బదిలీలు పొందిన ముగ్గురు ఉద్యోగులకు ఏపీఐఐసీ ఘన వీడ్కోలు


ఏపీఐఐసీలో ఎంతో కృషి చేశారు..కొత్త బాధ్యతల్లోనూ సత్తా చాటాలన్న ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది


గత ఐదేళ్లుగా ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య పనుల్లో చంద్రశేఖర్ పాత్ర కీలకం.


ఇవాళ 14 సేవలను ఆన్ లైన్ లోకి తీసుకురావడానికి ల్యాండ్ మాడ్యుల్ రూపొందించిన ఓఎస్డి ల్యాండ్స్ చంద్రశేఖర్.


ఓఎస్డీ ల్యాండ్స్ చంద్రశేఖర్, కర్నూల్, హిందూపురం జోనల్ మేనేజర్లు వి.నారాయణమ్మ,టీ.పద్మావతిలకు గుంటూరు జిల్లా డిఆర్ఓ, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్డీవో, పలమనేరు ఆర్డీవోలుగా బదిలీ.




భూముల విభాగానికి ఓఎస్డీ గా బాధ్యతలు నిర్వహించిన అధికారి చంద్రశేఖర్ కు ఏపీఐఐసీ  వీడ్కోలు పలికింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఎండి సుబ్రమణ్యం జవ్వాది సహా ఏపీఐఐసీ ఉద్యోగులు ఏపీఐఐసీ లి ఓఎస్డి ల్యాండ్స్ విధులు నిర్వహిస్తూ ఇక గుంటూరు జిల్లా డీఆర్వోగా బదిలీ అయిన చంద్రశేఖర్ తో జ్ఞాపకాలను వారు నెమరువేసుకున్నారు. నిత్యం చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించే చంద్రశేఖర్ ఏపీఐఐసీ లో కీలక బాధ్యతలు నిర్వహించారని ఎం బి సుబ్రహ్మణ్యం జవ్వాది ప్రశంసించారు. ఇన్నాళ్లు అలుపెరుగక శ్రమించిన చంద్రశేఖర్ కి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. కర్నూలు జోనల్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహించిన వి.నారాయణమ్మ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు ఆర్డీవో గా బదిలీ అవడం, హిందూపురం జోనల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్డీవో గా బదిలీ అవడంపైన ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది స్పందించారు. వారి సేవలనీ మెచ్చుకున్నారు. ఏపీఐఐసీలో వివిధ విభాగాలకు పని చేసిన ముగ్గురు అధికారులకు సోమవారం వీడ్కోలు పలికారు. కొత్త బాధ్యతలను సత్తా చాటాలని వారందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఈడీలు సుదర్శన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, సీజీఎంలు, వివిధ విభాగాలకు చెందిన హెచ్ఓడీలు, ఉద్యోగులు హాజరయ్యారు.



Comments