స్పందనలో స్వీకరించిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలి.

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): * స్పందనలో స్వీకరించిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలి.* రెండో సారి అవే ఫిర్యాదులు వొస్తే తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలి


- కలెక్టర్ డా. కె. మాధవీలత 


క్షేత్రస్థాయి లో అధికారులు పర్యటనలు చేస్తూ ప్రభుత్వ ప్రాధాన్యత పధకాలను ప్రజలకు చేరువ చేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని  జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు.సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో  స్పందన కార్యక్రమం లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ తో  కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, ఈ వారం సుమారు 140 పైగా స్పందన కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదులను అందచేసారన్నారు. పెన్షన్స్, భూమి సంబంధ అంశాలు, ఇండ్ల స్థలాలు, సరిహద్దు లు, రేషన్ కార్డులు, ఇసుక, గృహ నిర్మాణం, తదితర వాటి కోసం సమస్య పరిష్కారం కొరకు దరఖాస్తూ లను అందచేశారు. జిల్లా లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాలు వారికీ సంబందించిన కార్యకలాపాలు ప్రారంభించాలన్నారు. అత్యవసరం అయిన ఫైల్స్ తప్ప మిగిలిన అన్ని ఉత్తర ప్రత్యుత్తర ఫైల్స్ అన్ని ఈ-ఆఫీస్ ద్వారానే  పంపాలని ఆదేశించారు. స్పందన ఫిర్యాదు ల పరిష్కారం ప్రభుత్వ మార్గదర్శకాలకి లోబడి పరిష్కారం చూపించాలని పేర్కొన్నారు.


స్పందన కు ప్రత్యేక ఏర్పాట్లు :


ఆర్టీసీ బస్టాండ్, సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రత్యేక ఉచిత బస్సు సర్వీసు


కలెక్టరేట్ ఆవరణలో అర్జీ దారులు కోసం టెంట్, త్రాగునీరు ఏర్పాటు


స్పందన కు వొచ్చిన ఫిర్యాదు నమోదు కోసం సెల్ ఏర్పాటు


ఈ స్పందన కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డీఆర్వో ఏ. సుబ్బారావు, ఆర్డివోలు ఎస్. మల్లిబాబు, ఏ. చైత్ర వర్షిణి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Comments