రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
ప్రతి సోమవారం కలెక్టరేట్ లో స్పందన ఫిర్యాదులు స్వీకారం
జిల్లాలో రెండు రెవిన్యూ, మండల కార్యాలయాల్లో ఉ.10 నుంచి స్పందన కార్యక్రమం
ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్ స్టాండ్, సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఉచిత బస్సు సౌకర్యం
ఉదయం 9 గంటల నుంచి మ.2 వరకు ఉచిత ట్రిప్పులు
కలెక్టర్ డా. మాధవీలత
ఇకపై ప్రతి సోమవారం స్పందన ఫిర్యాదులని కలెక్టరేట్ లో కూడా స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటన లో తెలియచేసారు.
రాజమహేంద్రవరం రూరల్ గ్రామం ధవళేశ్వరం లో ఉన్న న్యాక్ (ఎన్. ఏ. సి) భవనంలో కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. స్పందన కి ప్రజలు రావడానికి వీలుగా ఉదయం 9 నుంచి మ. 2 వరకు తాత్కాలికంగా ఉచిత బస్సు సర్వీసు ఆర్టీసీ బస్టాండ్ నుంచి, స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి స్పందనలో ఫిర్యాదు లు అందచేసే ప్రజల కోసం ఉచిత బస్సు ను ఏప్రిల్ 11 వ తేదీన నడుపుతున్నట్లు మాధవీలత తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
స్పందన ఫిర్యాదులను గ్రామ/వార్డు సచివాలయాల్లో , రెవెన్యూ, మండల స్థాయి కార్యాలయాల్లో కూడా స్వీకరించడం జరుగుతుందని, ఫిర్యాదిదారుల కి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.
మోరంపూడి నుంచి వేమగిరి వైపు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో ఉన్న హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న న్యాక్ భవన సముదాయంలో కలెక్టరేట్ ఏర్పాటు చెయ్యడం జరిగింది. రాజమహేంద్రవరం కి పలు రూట్లలో నడిపే ఆర్టీసీ బస్సులు సోమవారం రోజున ఉదయం కొన్ని బస్సులు కలెక్టరేట్ మీదుగా నడిపేలని ఆర్టీసీ అధికారులను ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది.
addComments
Post a Comment