స్పందనలో అందిన అర్జీల పరిష్కారంలో మరింత వేగం పెరగాలి
అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడవులోగా పరిష్కార తీరు వుండాలి ...
*బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్ళకూడదు.... గడువులోగా పరిష్కరించండి**
: *జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
పుట్టపర్తి, ఏప్రిల్ 25 (ప్రజా అమరావతి);
*స్పందన కార్యక్రమానికి వస్తున్న అర్జీలను నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ అధికారులను ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం స్పందన కార్యక్రమం నిర్ర్వహించారు. సోమవారం స్పందనకు ప్రజల నుంచి వచ్చిన 166 అర్జీలను స్వీకరించారు.
ఈ సంధర్బంగా జిల్లా నలుమూల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారుల అందించిన వినతులను పరిశీలించి వాటి పరిష్కారం కు సంబందించి ఫోన్,వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులు, తహశీల్దారల్లతో కలెక్టర్ బసంత కుమార్ మాట్లాడుతు అవసరమైన ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీ.ఎస్. చేతన్ ,డిఆర్ఓ గంగాధర్ గౌడ్, పుట్టపర్తి ఆర్డిఓ భాగ్య రేఖ, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా, అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. స్పందన అర్జీలను మరింత సులభతరంగా, నాణ్యతతో పరిష్కరించడంతో పాటు పరిష్కార నివేదికను కూడా సంబందిత పోర్టల్లో పొందుపరచాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు
వచ్చిన ఫిర్యాదుదారుడు మరల మరల రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉన్నదని పేర్కొన్నారు.జిల్లాలో స్పందన గ్రీవెన్స్ వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసుకుని ఆఫీసర్స్ లాగిన్ లో సమస్యలు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కదిరి,హిందూపురం, పెనుగొండ, తనకల్లు, గోరంట్ల, మడకశిర, తాసిల్దార్ లను భూ సమస్యలు పరిష్కరించవలసిందిగా లనుఆదేశించారు. లేనిపక్షంలో తానే స్వయంగా మీతో మాట్లాడతానని హెచ్చరించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు చేపడతానని హెచ్చరించారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం మండల ప్రధాన కేంద్రం లో సంబంధిత తహసీల్దార్ అధ్యక్షతన స్పందన కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. అధ్యక్షతన స్పందన కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు.
స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొన్ని వినతులు :-*
1 ముదిగుబ్బ మండలం, గుడ్డం పల్లి తాండ చెందిన ఎం లక్ష్మీ నాయక్ అను నేను 1984 ప్రభుత్వం వారు సర్వే నంబర్ 627.1A లో మూడు ఎకరాలు నా పేరు న డి పట్టా ఇచ్చారు. కొందరు నా స్థలాన్ని ఆక్రమించుట కు ప్రయత్నించు చున్నారు నాకు నా భూమిని సక్రంగా సర్వే చే పించవలసిందిగా వినతిని అందజేశారు.
2. నల్లమడ మండలం పులగం పల్లి గ్రామానికి చెందిన ఈ మంజునాథ్ అనే నేను సర్వే నంబర్ 291 లో మూడు ఎకరాల భూమి కలదు పట్టాదార్ పాస్ పుస్తకం మంజూరు చేయవలసిందిగా మెంతులు అందజేశారు
3. గోరంట్ల మండలం, పాలసముద్రం గ్రామానికి చెందిన వహీదా సర్వే నంబర్292-3 నందు1.06 సెంట్ల మొత్తం విస్తీర్ణం గల వ్యవసాయ భూమిని నా సీన్ మరియు బెల్ కంపెనీ స్థాపన నిర్మాణం కోసం ప్రభుత్వం వారు 2014 సంవత్సరంలో మా భూమి ని తీసుకున్నారు. కానీ నాకు ఇంతవరకు భూ నష్టపరిహారం అందజేయడం లేదు కావున న్యాయం చేయవలసినదిగా వినతులు అందజేశారు.
అంతకుమునుపు జిల్లా కలెక్టర్ ,జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో వడదెబ్బకు నివారణకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, మీసేవ తాసిల్దార్ అనుపమ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment