తనిఖీల ద్వారా సచివాలయాల పనితీరు మెరుగవుతుంది

 తనిఖీల ద్వారా సచివాలయాల పనితీరు మెరుగవుతుంది* 


: *జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్* 


పుట్టపర్తి, ఏప్రిల్ 18 (ప్రజా అమరావతి);


ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం ద్వారా సచివాలయాల పనితీరు మెరుగవుతుందని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. 

 సోమవారం పుట్టపర్తిలోని    ఎనుముల పల్లి-2   నందు 7 వ వార్డు సచివాలయంని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను  పరిశీలించారు, వివిధ సంక్షేమ పథకాల అమలు తీరుపై వార్డు సచివాలయ సిబ్బంది ఆరా  తీశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.  


 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో స్పందన ఫిర్యాదుల పరిష్కారాలు ఆలస్యం కావడం జరిగేదని ఈ మధ్య కాలంలో స్పందన ఫిర్యాదుల పరిష్కారాల్లో నాణ్యత గణనీయంగా పెరిగిందన్నారు. నిర్ణీత సమయంలోనే ఫిర్యాదులకు పరిష్కారాలు చూపడం, ఫిర్యాదు దారుడి సంతృప్తి చెందేవిధంగా పరిష్కారాలు చూపడం జరుగుతోందన్నారు. వ్యక్తిగతంగా వారానికి రెండు గ్రామ, వార్డు సచివాలయాలు తనిఖీ చేయాలని అదేశాలున్నాయని, ఇతర అధికారులు సైతం గ్రామ/వార్డు సచివాలయాలలో తనిఖీలు చేపడితే ప్రజలకు మరింత మెరుగైన సేవలు దక్కుతాయన్నారు. అధికారుల తనిఖీల ద్వారా సచివాలయాలలో ఏమైనా సమస్యలుంటే అవి ఉన్నతాధికారుల దృష్టికి వచ్చే అవకాశం  ఉంటుందన్నారు అన్ని సచివాలయాల్లో వివిధ సంక్షేమ పథకాలు  లబ్ధి పొందిన అర్హులైన జాబితాను/ అనర్హులైన  లబ్ధి పొందన జాబితాను ఖచ్చితంగా ప్రదర్శించాలని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వాలంటరీ వ్యవస్థను మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని,స్వచ్ఛంద సేవకులుగా అవినీతి లేని వ్యవస్థ తీసుకువచ్చేలా వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగించిందన్నారు. కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందించడం జరుగుతోందన్నారు.ప్రతి వాలంటీర్ కి కూడా ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలందరికీ వివరించాల్సిన బాధ్యత ఉందని, ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. అభివృద్ధిలో కూడా వాలంటీర్ల భాగస్వామ్యం అవసరం అన్నారు.   ప్రస్తుతం గ్రీవెన్స్ తగ్గుముఖం పట్టిందని తెలిపారు. అన్ని సర్వీసులు ప్రజలకి నాణ్యమైన సేవలు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువ అవుతున్నాయని తెలిపారు. పుట్టపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రోజుకి 180 మంది  రోగులుకు వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు.  భవిష్యత్తులో  ఆసుపత్రిని  అన్ని రకాల అభివృద్ధి చేయడాని  నా వంతు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. నిరంతరం ప్రజలకు  నాణ్యమైన వైద్యసేవలు అందించడానికి ప్రత్యేక  చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. నేనే స్వయంగా ఈరోజు ఆసుపత్రిని పరిశీలించడం జరిగింది అని. అన్ని వసతులు, మందులు,  వివిధ పరీక్షల రిజల్ట్ పరిశీలించడం జరిగిందిని తెలిపారు. ఈ ఆసుపత్రి నందు ఈనెల 21వ తేదీన గొప్ప ఆరోగ్యం   మేళ నిర్వహించడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగరాజు నాయక్ ,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోష్న, వార్డు సెక్రటరీ  మరియు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సాయి సౌభాగ్య లక్ష్మి, వైద్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments