మహిళల భద్రత తో పాటు అన్ని సంక్షేమ పథకాలను మహిళల పేరుతోనే అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కే దక్కుతుంది...




గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి దిశ చట్టానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు : గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. 



మహిళల రక్షణే ధ్యేయంగా  దిశ యాప్ ను ప్రవేశపెట్టిన ఘనత గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి దే:

  జిల్లా ఇంచార్జ్  మంత్రి.


మహిళల భద్రత తో పాటు అన్ని సంక్షేమ పథకాలను మహిళల పేరుతోనే అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కే దక్కుతుంది...



 గౌ.రాష్ట్ర విద్యుత్, శాస్త్ర సాంకేతిక, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖల మాత్యులు. 



దిశ చట్టం ను పటిష్టంగా అమలు చేసేందుకు అవసరమైన అన్నీ వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది : జిల్లా కలెక్టర్.


 చిత్తూరు,ఏప్రిల్ 30 (ప్రజా అమరావతి) :   


రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి మహిళలల రక్షణ కు  ఏ రాష్ట్రం లో లేని విధంగా మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా దిశ చట్టం ను అమలు చేయడం జరుగుతున్నదని  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి పేర్కొన్నారు.



 శనివారం ఉదయం చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సామూహికంగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునే కార్యక్రమాన్ని  నిర్వహించారు. 


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి గౌ. రాష్ట్ర  ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. మహిళలు, విద్యార్థునులు నిర్భయంగా ఉండటానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

 


గౌ. జిల్లా ఇంఛార్జి మంత్రి మరియు మహిళలు,పిల్లలు,దివ్యాంగులు,సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ మంత్రి   శ్రీ మతి కె.వి. ఉష శ్రీ చరణ్ మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి  పలు అభివృద్ధి , సంక్షేమ పథకాలను  అమలు చేస్తూ అందుకు  సంబంధించి మహిళల పేర్లు తో ఇవ్వడం జరిగిందని అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి దే అని అన్నారు. ఆర్థికంగా మహిళల అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి భావించారని తెలిపారు.  మహిళలకు లబ్ధి చేకూరేలా పథకాల అమలు తో పాటు మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఆపదలో ఉన్న మహిళలు  ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ యాప్ ద్వారా కంట్రోల్ రూమ్ కు సమాచారం అంది అక్కడి నుంచి వారు ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడం జరుగుతుందని దాని ద్వారా ఆపదలో ఉన్న మహిళలను సకాలంలో రక్షించడం జరుగుతొందన్నారు. ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రికి మహిళాలోకం జేజేలు పలుకుతోందన్నారు.



గౌ.రాష్ట్ర విద్యుత్, శాస్త్ర సాంకేతిక, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖల  మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని అలా ఎదిగిన అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు గా భావించిన ముఖ్యమంత్రి వారి రక్షణ ను  కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని దిశ చట్టాన్ని చేయడం జరిగిందన్నారు. అన్ని సంక్షేమ పథకాలు మహిళల పేర్లతో  అందించడం ద్వారా వారితో పాటు వారి కుటుంబం కూడా  ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని  ముఖ్యమంత్రి భావించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత గా చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పట్టాలను కూడా మహిళల పేరుమీదనే ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని గుర్తుచేస్తుందన్నారు.



జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్  మాట్లాడుతూ భారతదేశంలో దిశ సంఘటన జరిగిన తరువాత మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని జిల్లాలో ఇప్పటివరకు 7.62 లక్షల మంది ఈ యాప్ ను  డౌన్లోడ్ చేసుకుని సుమారు 4 లక్షల మందికి పైగా మహిళలు జిల్లా వ్యాప్తంగా ఉపయోగించడం ఆనందించదగ్గ విషయం అన్నారు. చట్టం తీసుకురావడంతో పాటు అమలు చేయడానికి కావలసిన అన్ని వసతులు రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం పటిష్టంగా అమలు చెయ్యడానికి వీలు అవుతుందన్నారు. 


అనంతపురం రేంజ్ డి.ఐ.జి.రవి ప్రకాష్ మాట్లాడుతూ మహిళా భద్రతకు అందరూ సహకరించాలని, దిశ ఆప్ ను డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించాలని  అన్నారు.

   

జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకురావడం తో ఈ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తునామన్నారు. 


 

  చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు దిశా ఆప్ 7.62 లక్షలమంది డౌన్లోడ్ చేసుకోగా  ప్రస్తుతం నాలుగు లక్షల మంది వినియోగిస్తున్నారు.



ఈ కార్యక్రమం లో  గౌ. చిత్తూరు పార్లమెంటు సభ్యులు  రెడ్డప్ప, రాష్ట్ర ఆర్ టి సి వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి, రాష్ట్ర పాల ఏకిరి కార్పొరేషన్ చైర్మన్ మురళీధర్, డిసిసిబి చైర్మన్ రెడ్డమ్మ, చిత్తూరు, పూతలపట్టు శాసనసభ్యులు శ్రీనివాసులు, శాసనసభ్యులు ఎం ఎస్ బాబు, ఎమ్మెల్సీ కె ఆర్ జె భరత్, చిత్తూరు మేయర్ అముద, రాష్ట్ర ఉపాధిహామీ కమిటీ సభ్యుడు విశ్వనాథన్, చిత్తూరు నగరపాలక కమిషనర్ అరుణ, తదితరులు పాల్గొన్నారు.



Comments