మంత్రి గుడివాడ అమర్ నాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది





*మంత్రి గుడివాడ అమర్ నాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది


*


*పరిశ్రమల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ఎండీ*



అమరావతి, ఏప్రిల్, 13 (ప్రజా అమరావతి) : పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ని ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది కలిశారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ లో బుధవారం సమావేశమై మంత్రి అమర్ నాథ్ కి ఆయన శుభాభినందనలు తెలిపారు. ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం పూర్తి చేసుకున్న సందర్భంగా  మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి ఎండీ సుబ్రహ్మణ్యం శుభాకాంక్షలు తెలిపారు.  ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న కీలక ప్రాజెక్టుల సమగ్ర సమాచారాన్ని ఎండీ సుబ్రమణ్యం జవ్వాది మంత్రికి అందజేశారు. 


Comments