సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మేరుగు నాగార్జున

 సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మేరుగు నాగార్జున


అమరావతి,18 ఏప్రిల్ (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులుగా మేరుగు నాగార్జున పదవీ బాధ్యతలు చేపట్టారు.సోమవారం అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ముందుగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్,బాబూ జగజ్జీవన్ రామ్,దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వైయస్.రాజశేఖర్ రెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన పిదప మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సాంఘిక సంక్షేమశాఖలో ఒక అధికారి డిప్యుటేషన్ కు సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు.అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సాంఘిక సంక్షేశాఖ నూతన డిప్యూటీ డైరెక్టర్ ను నియమిస్తూ రెండవ దస్త్రంపై సంతకం చేశారు. అనంతరం మంత్రి నాగార్జున మీడియాతో మాట్లాడుతూ దళితులు పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి తనకు సాఘింక సంక్షేమశాఖ మంత్రిగా అవకాశం కల్పించినందుకు సియంకు ధన్యవాదాలు తెలియజేశారు.దళిత వర్గాలకు అన్ని విధాలా అందుబాటులో ఉండి వారికి మరిన్ని సేవలు అందించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.ముఖ్యంగా సమాజంలోని ప్రతి దళితునికి ప్రభుత్వం అమలు చేసే ప్రతి పధకం సక్రమంగా అందేలా తనవంతు కృషి చేస్తానని మంత్రి నాగార్జున స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖలో అపరిస్కృతంగా ఉన్న వివిధ సమస్యలను ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి వాటిని సకాలంలో పరిష్కరించేందుకు తగిన ప్రయత్నం చేస్తానని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు.రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్,బాబూ జగజ్జీవన్ రామ్ ల ఆశయాల సాధనలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి అనేక పధకాలు అమలు చేస్తున్నారని రానున్న రోజుల్లో మరిన్ని పధకాలు తీసుకవచ్చి దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.సాట్యురేషన్ విధానంలో నవరత్నాలను పేదలందరికీ అందించేందుకు కృషి జరుగుతోందని మంత్రి నాగార్జున పేర్కొన్నారు.వివిధ సంక్షేమ పధకాలు ప్రక్కదారి పట్టకుండా నివారించి అర్హులైన ప్రతి పేదవానికి ఆ సంక్షేమ ఫలాలు చేరేలా తనవంతు కృషి చేస్తానని మంత్రి నాగార్జున స్పష్టం చేశారు.

ఈకార్యక్రమంలో రాష్ట్ర ఇంధన శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పాల్గొని మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.ఇంకా ఈకార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖకు చెందిన పలువురు అధికారులు,పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొని మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

   

Comments