రమ్య కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం...

 


విశాఖపట్నం (ప్రజా అమరావతి);


*విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన హోం మంత్రి శ్రీమతి తానేటి వనిత...*


*రమ్య కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం...


*


*హంతకుడికి ఉరి శిక్ష ఒక చత్రాత్మకమైన తీర్పు...*


*ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ చాలా వేగం...*


*దిశ చట్టం స్ఫూర్తితో కేసు దర్యాప్తు జరిగింది...*


*దిశ పోలీస్‌ స్టేషన్లు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు, ప్రత్యేక సిబ్బంది బాగా పని చేస్తున్నారు...*


*ఇదే స్పూర్తితో ఇక ముందూ కేసుల విచారణ...*


*మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం...*


*దిశ యాప్‌కు అత్యంత ఆదరణ లభిస్తోంది...*


*ప్రెస్‌మీట్‌లో మంత్రి శ్రీమతి తానేటి వనిత...*


*ప్రెస్‌మీట్‌లో మంత్రి శ్రీమతి తానేటి వనిత ఇంకా ఏం మాట్లాడారంటే...*


*చరిత్రాత్మక తీర్పు:*


బిటెక్‌ విద్యార్థిని రమ్య దారుణహత్య కేసులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు చాలా వేగంగా విచారణ పూర్తి చేసి ఇవాళ తీర్పు ఇచ్చింది. హంతకుడు శశికృష్ణకు కోర్టు ఉరి శిక్ష విధించడం నిజంగా చరిత్రాత్మక తీర్పు. ఆ తీర్పును స్వాగతిస్తున్నాం.


*దిశ చట్టం–దిశ యాప్‌:*


మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ చట్టాన్ని రూపొందించి, కేంద్రానికి పంపాం. ఆ తర్వాత రాష్ట్రంలో దిశ పోలీస్‌ స్టేషన్లు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు, అన్ని చోట్లా తగిన సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించే విధంగా ఈ చర్యలన్నీ తీసుకున్నాం. 


ఒక్క దిశ యాప్‌ ద్వారానే దాదాపు 900 మంది అమ్మాయిలను రక్షించడం జరిగింది. దాదాపు 1.24 కోట్ల యువతులు, అమ్మాయిలు, మహిళలు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.


*దిశ చట్టం అవసరం:*


రమ్యను గుంటూరులో పట్టపగలే శశికృష్ణ దారుణంగా పొడిచి చంపాడు. ఆ తర్వాత 10 గంటల్లోనే అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలో విజువల్స్‌ రికార్డ్‌ అయ్యాయి. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపితే కేవలం రెండు రోజుల్లోనే నివేదిక ఇచ్చారు. రమ్య కేసు పూర్తిగా దిశ చట్టం స్ఫూర్తితోనే జరిగింది. ఈ తీర్పు ఇప్పుడు దిశ చట్టం అవసరాన్ని గుర్తు చేస్తోంది.


గతంలో దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో, సుదీర్ఘంగా ఏడేళ్ల పాటు విచారణ తర్వాత కానీ, నిందితులకు శిక్ష పడలేదు.

కానీ ఇక్కడ దిశ చట్టం స్ఫూర్తితో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో చాలా వేగంగా విచారణ పూరై్తంది. కేవలం 8 నెలల్లోనే హంతకుడికి ఉరి శిక్ష పడింది.


మహిళల రక్షణ కోసం సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. నిజానికి దిశ ఘటన తెలంగాణలో జరిగింది. అలాంటి ఘటనలు ఇక్కడ చోటు చేసుకోకుండా, మహిళలకు రక్షణగా దిశ చట్టం రూపొందించడంతో పాటు, దిశ పోలీస్‌ స్టేషన్లు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడం జరిగింది.


*రమ్య కుటుంబాన్ని ఆదుకున్నాం:*


ఇదే స్ఫూర్తితో ఇక ముందు కూడా కేసుల విచారణ జరగుతుంది. రమ్య కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంది. వారికి రూ.1.60 కోట్లతో భూమి కొని ఇవ్వడంతో పాటు, రూ.10 లక్షల నగదు ఇచ్చాం. ఇంకా రమ్య సోదరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చాం.


*మీడియా ప్రశ్నలకు సమాధానంగా...*


*అప్పటికి ఇప్పటికీ ఇదే తేడా:*


గత ప్రభుత్వ హయాంలో కూడా క్రైమ్‌ రేట్‌ ఎక్కువగానే ఉంది. కానీ అప్పుడు చాలా చోట్ల వారికి ఎలాంటి భరోసా లేకపోవడంతో, చాలా కేసులు వెలుగులోకి రాలేదు. చాలా మంది అసలు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. అభద్రతా భావంతో బాధితులు ముందుకు వచ్చే వారు కాదు.


అయితే ఈ ప్రభుత్వం మహిళలు, యువతులకు రక్షణ కల్పిస్తోంది. వారిలో అంతులేని భరోసా కల్పిస్తోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పక్కాగా అమలు చేస్తున్నాం. అందుకే పోలీసులంటే భయపడకుండా, ధైర్యంగా వారికి ఫిర్యాదు చేసేలా చర్యలు చేపట్టాం. అందుకే బాధితులు ధైర్యంగా ముందుకు వస్తున్నారని మంత్రి శ్రీమతి వనిత వివరించారు.

Comments