గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల సంక్షేమానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు: గౌ.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.
జిల్లా సమగ్రాభి వృద్ధి కి కృషి చేస్తా: గౌ.జిల్లా ఇంచార్జ్ మంత్రి.
అర్హులందరికి సంక్షేమ పధకాలు లబ్ధి: గౌ. రాష్ట్ర విద్యుత్, శాస్త్ర సాంకేతిక, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి.
కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పధకాల లబ్ధి: గౌ. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజన సర్వీసులు శాఖ మంత్రి.
చిత్తూరు, ఏప్రిల్ 30 (ప్రజా అమరావతి):
గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి అన్ని వర్గాల సంక్షేమానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని గౌ.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారా యణ స్వామి పేర్కొ న్నారు..
శనివారం చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ లోని వై.ఎస్.ఆర్ సభా వేదిక ప్రాంగణం లో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం గౌ. జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు మహిళలు,పిల్లలు,దివ్యాంగులు,సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి. కె.వి. ఉష శ్రీ చరణ్ అధ్యక్షతన . గౌ.రాష్ట్ర విద్యుత్, శాస్త్ర సాంకేతిక, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖల మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌ. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజన సర్వీసులు శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె రోజా, జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ తో కలసి జిల్లా సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సమీక్ష సమా వేశం లో గౌ. చిత్తూ రు పార్లమెంటు సభ్యులు ఎన్. రెడ్డప్ప, గౌ. జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివా సులు, గౌ.చిత్తూరు పలమనేరు,పూతల పట్టు శాసన సభ్యు లు ఆరణి శ్రీనివా సులు, వెంకటే గౌడ్,ఎం.ఎస్.బాబు,గౌ.ఎం ఎల్ సి భరత్, జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వ ర్,డిఆర్ ఓ రాజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు....
ఈ సంధర్భంగా గౌ. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ గౌ. రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బిసి గ్రామాలలో నాడ- నేడు పథకం ద్వారా పాఠశాలలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ తొందరగా పూర్తి చేయాలన్నారు. అన్ని మండలాల్లోని సప్లై ఛానల్స్ సర్వే చేయించాలని, సప్లై ఛానల్స్ మరమత్తు పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేయాలన్నారు, శ్మశాన వాటికలు లేని గ్రామాలలో వీటికి ఏర్పాటు చేపట్టాలని తెలిపారు.
చిత్తూరు జిల్లా ఇం చార్జి మంత్రి మాట్లా డుతూ చిత్తూరు జిల్లా సమగ్రాభివృ ద్ధికి కృషి చేస్తాన్నని మరియు జిల్లా ను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సంక్షేమ పధకాలను మరింత పారాధర్శకంగా అమలు చేసేందుకు కృషి చేస్తూ పధకాల అమలకు సంబందించి ప్రజలకు అవగాహన ను పెంచాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబందించి రైతు భరోసా కేంద్రాలలో గల సహాయకులు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతుల పై మరింత అవగాహన కల్పించాలని తెలిపారు. చిత్తూరు జిల్లా పేదలందరికి ఇండ్లు కార్య క్రమం అమలులో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో కలదన న్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మందులను అందుబాటులో వుంచాలని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.
గౌ. రాష్ట్ర విద్యుత్, శాస్త్ర సాంకేతిక, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు గా పని చేస్తోందని తెలిపారు పెదలందరికి ఇల్లు కార్యక్రమం అమలు లో జిల్లా ప్రధమ స్థానం లో కాలదని గృహ నిర్మాణాలకు సంబందించి ఇల్లు మంజూరైన లబ్ధి దారులు ఇంటి నిర్మాణ పనులను చేపట్టే లా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లా ను అభివృద్ధి పధం పయనింప చేసేందుకు కృషి చేస్తామన్నారు.
గౌ. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువ జన సర్వీసులు శాఖ మంత్రి మాట్లాడుతూ కుల మత పార్టీలకు అతీతంగా సంక్షేమ పధకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.చెరువుల, శ్మశాన వాటికల అక్రమణలకు గురి కాకుండా రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 4న కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మొదటి సారి జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా లో గ్రామాల వారీగా శ్మశాన వాటికలను పరిశీలించి శ్మశాన వాటిక లేని గ్రామాలకు భూమి కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. నాడు నేడు ద్వారా పాటశాలల్లో మౌలిక వసతులు అభివృద్ది చేస్తున్నామని తెలిపారు.
అనంతరం జిల్లా సమీక్షా కమిటీ ఈ సమావేశంలో భాగంగా పొందుపరిచిన అజెండాలోని అంశాల వారీగా గృహనిర్మాణం, ఏపీ టిట్ కో, నాడు నేడు,మన బడి,వైద్య ఆరోగ్య శాఖ లో నాడు నేడు, అర్బన్ హెల్త్,క్లినిక్ లు, భూ రిసర్వే,గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ శాఖ,గ్రామీణ నీటి పారుదల శాఖ, నీటి పారుదల శాఖ (ఇరిగేషన్), గ్రామా సచివాలయాలు,గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి జిల్లా ప్రగతిని సంబందితా శాఖల అధికారులు సమావేశంలో వివరించారు.
నవరత్నాలు లో భాగంగా పేదలందరికి ఇల్లు కార్యక్రమం లో భాగంగా జిల్లా రూ.318.19 కోట్లతో 72,272,గృహాల గృహనిర్మాణంలో 72 శాతం తో రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ అధికారుల సహకారంతో గృహనిర్మాణంలో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉందని గృహనిర్మాణ సంస్థ పిడి పద్మనాభం తెలిపారు.
జిల్లాలో రూ.316.70 కోట్ల తో టిక్కో ద్వారా నిర్మిస్తున్న గృహాలను 2022 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, అధికారులు తెలిపారు. జిల్లాలో నాడు నేడు - మనబడి పథకం ద్వారా 783 పాఠశాల లో రూ.217 కోట్లతో 784 అదనపు గదులు నిర్మాణ చేపట్టడం జరిగిందని సమగ్ర శిక్ష అదనపు కొ-ఆర్డినేటర్ వెంకటరమణ రెడ్డి తెలిపారు. నాడు నేడు పథకం లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రూ.11.95 కోట్ల తో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మాణాలు పనులు 25 శాతం చేపట్టడం జరిగిందని వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ లు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, వైద్య ఆరోగ్య శాఖ ఆధికారి డాక్టర్ శ్రీ.హరి తెలిపారు. జిల్లాలో 370 గ్రామాలలో వైయస్సార్ జగనన్న భూ రి సర్వే చేపట్టగా ఇప్పటి వరకు 241 గ్రామాలలో పూర్తి చేయడం జరిగిందని, జిల్లా లో డోన్ ప్లే ద్వారా 83 గ్రామాలలో వ్యవసాయ భూమి 86181 ఎకరాల రిసర్వే చేయడం జరిగిందని ల్యాండ్ & రికార్డ్స్ ఎడి తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 1,50,682 జాబ్ కార్డులు కలిగిన వారికి 7968671 పనిదినాలు కల్పించడం జరిగిందని, రూ.181.311 కోట్లు ఖర్చు చేయడం పిడి డ్వామా చంద్రశేఖర్ తెలిపారు. వ్యవసాయ శాఖ ద్వారా ఖరీఫ్ సీజనకు సంబంధించి రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, 502 రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు కావలసిన సమాచారాన్ని అందజేయడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి మురళి కృష్ణ తెలిపారు. గ్రామీణ నీటిపారుదల శాఖ ద్వారా జిల్లాలో జల జీవన్ మిషన్ ద్వారా డిసెంబర్ 31 నాటికి ఇంటింటికి త్రాగునీరు అందించడం జరుగుతుందని గ్రామీణ నీటిపారుదల శాఖ ఎస్ ఈ వెంకటరమణ తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు, వైయస్సార్ డిజిటల్ గ్రంథాలయాలు, జగనన్న పాలవెల్లువ కేంద్రాలు పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయని ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ ఎస్ఇ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇర్రిగేషన్ శాఖ కు సంబందించి జిల్లాలో మైనర్ ఇరిగేషన్ క్రింద 1.21 లక్షల ఎకరాల ఆయకట్టు కలదని కృష్ణపురం ఇర్రిగేషన్ ప్రాజెక్టు క్రింద 6125 ఎకరాలు సాగు అవుతున్నదని ఎస్.ఈ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయాలకు సంబందించి జిల్లా లో 612 సచివాలయాలలో 6120 మంది సచివాలయ సిబ్బంది, 9346 వాలంటీరులు పని చేస్తున్నారని వీరు అందరూ ప్రభుత్వ సంక్షేమ పధకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారని జెడ్.పి.సి.ఈ.వో ప్రభాకర్ రెడ్డి తెలిపారు. డి.ఆర్.డి.ఏ ద్వారా వివిధ రకాల పెంషన్ల క్రింద 252741 లబ్ధి పొందుతున్నారని పి.డి తులసి తెలిపారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర జానపద కళ ల అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండవీటి నాగ భూషణం,
డిసిసిబి చైర్మన్ రెడ్డమ్మ,చిత్తూరు నగర పాలక సంస్ధ చైర్ పర్సన్ అముద, కుప్పం రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ లతో చిత్తూరు ఆర్ డి ఓ రేణుక, ,ఆర్ &బి ఎస్ ఈ దేవా నందం, డి పి ఓ దశరథరామి రెడ్డి, వ్యవ సాయ శాఖ జెడి మురళీధర్,డి ఈ ఓ పురుషోత్తం, , చిత్తూరు నగర పాలక సంస్థ మునిసిపల్ కమీష నర్ అరుణ, సంబం ధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు..
addComments
Post a Comment