స్పందన కోసం కలెక్టరేట్ కు రెండో వారం కూడా ఉచిత బస్సు సౌకర్యం

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి) : 


స్పందన కోసం కలెక్టరేట్ కు  రెండో వారం కూడా ఉచిత బస్సు సౌకర్యం 



ఉదయం  9 గంటల  నుంచి  మ.2 వరకు ఉచిత ట్రిప్పులు 


కలెక్టర్ డా. మాధవీలత 


 సోమవారం (ఏప్రిల్ 17) న ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు "స్పందన " కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత ఆదివారం  ఒక ప్రకటన లో తెలియచేసారు. 


రెండవ వారం కూడా ఆర్టీసీ బస్టాండ్ నుంచి కలెక్టరేట్, ప్రజల కోసం ఉచిత బస్సు సర్వీస్ నడుపుతున్నామని, ఉదయం 9 నుంచి  మ.2 వరకు ఉచిత బస్సు సర్వీస్ నడుపు తున్నట్లు పేర్కొన్నారు.



Comments