జగనన్న వసతి దీవెన

 

నంద్యాల (ప్రజా అమరావతి);


*జగనన్న వసతి దీవెన


*


*నేడు రాష్ట్రవ్యాప్తంగా 2021–22 విద్యా సంవత్సరానికి జగనన్న వసతి దీవెన రెండో విడతగా 10,68,150 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 1,024 కోట్లు బటన్‌ నొక్కి జమ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన విద్యార్ధులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*కరణం బృహతి మానస, డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్ధిని*


అందరికీ నమస్కారం, అన్నయ్యా మీరు ఎప్పుడూ బాగుండాలి, మా బాగోగులు చూసుకుంటారని కోరుకుంటున్నాను. దేవుడు అడిగితేనే వరమిస్తాడు, అది విద్యా దీవెన అయితే అడగకుండానే మీరు వసతి దీవెన అనే వరమిచ్చారు. నేను గర్వంగా చెప్తున్నాను. ఈ పాలనకు ముందు, తర్వాత అని మాట్లాడుకుంటే ఇంటర్‌ చదివేటప్పుడు మాది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. ఉన్నత చదువులు చదవగలనా లేదా అనుకునే సమయంలో మీరు విద్యా దీవెన ప్రవేశపెట్టారు. నా డిగ్రీ మూడేళ్ళ చదువు భారమంతా మీరే భరించారు. వసతి దీవెన ద్వారా ఏడాదికి రూ. 20 వేలు ఇస్తూ చాలామంది విద్యార్ధులకు సాయం చేస్తున్నారు. మాలాంటి విద్యార్ధులకు మంచి పౌష్టికాహారం కూడా దొరుకుతుంది. నాకు చిన్న తమ్ముడు ఉన్నాడు, నా తమ్ముడికి అమ్మ ఒడి వస్తుంది. మీ వల్ల నాలాగా ఎంతోమంది చదువుకుంటున్నారు. మా నాన్నగారు దేవాదాయశాఖకు సంబంధించిన గుడిలో చిన్న అర్చకులు. మన ప్రభుత్వం రాగానే అందరికీ జీతాలు డబుల్‌ అయ్యాయి. మేం అన్ని నవరత్నాల పథకాలు పొందుతున్నాం. మీరు ఇంత చేస్తున్నారు మా కోసం, మేం ఏం చేయగలం మీకు...ధ్యాంక్స్‌ అనేది చాలా చిన్న పదం. నేను భవిష్యత్‌లో గొప్ప లాయర్‌ అయి నేను ఉపాధి పొందడం కాకుండా పదిమందికి ఉపాధి కల్పిస్తాను. అది కేవలం మీ స్ఫూర్తి వల్లనే...నేను ఈ సభ సాక్షిగా మాట ఇస్తున్నాను. నంద్యాలను జిల్లా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు, ధ్యాంక్యూ.


*సౌమ్యశ్రీ,, బీటెక్‌ విద్యార్ధిని, నంద్యాల*


అందరికీ నమస్కారం, మాది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ, నవరత్నాల పథకాలు చాలా చక్కగా అమలుచేస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నా సీనియర్లు దాదాపు 70 శాతం మంది ఈ స్కీమ్‌ వల్ల బాగా చదువుకుని మంచి మంచి కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. విప్రొ, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌ వంటి కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. నా సోదరుడు ఎంటెక్‌ చేస్తున్నారంటే కారణం అతని బీటెక్‌ అంతా కూడా ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ద్వారానే పూర్తయింది. మా కుటుంబం ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధిపొందింది.  దిశ యాప్‌ చాలా బావుంది, మహిళలంతా కూడా ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇది మహిళల భద్రత, రక్షణగా ఉంది. 2020లో కేంద్రం నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీని విడుదల చేసింది. ఇది చాలామంది విద్యార్ధులకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా విద్యార్ధులు కూడా స్కాలర్‌షిప్‌ల ద్వారా మరింత ఉన్నత చదువులు చదువుకోవచ్చు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా విద్యార్ధులు మరింత ఉన్నత చదువులు చదువుకోవచ్చు. ఇది రాష్ట్ర అభివృద్దికే కాదు, దేశ అభివృద్దిలో కూడా భాగమవుతుంది. సీఎంగారు చాలా ముందుచూపుతో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు ఇలాంటి పథకాలు ప్రారంభించి చక్కగా అమలుచేశారు. ఆయన మరణం తర్వాత ఏ ఒక్కరూ పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ అమలుచేయలేదు. ఇప్పుడు సీఎంగారు మళ్ళీ అవన్నీ అమలుచేస్తున్నారు. మా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంటుంది. ధ్యాంక్యూ సీఎం సార్‌.

Comments