మత సామరస్యానికి ప్రతీక రంజాన్**మత సామరస్యానికి ప్రతీక రంజాన్**

జిల్లా కలెక్టర్ బసంత్  కుమార్ 


పుట్టపర్తి, ఏప్రిల్ 29 (ప్రజా అమరావతి): పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలన జిల్లా కలెక్టర్   బసంతకుమార్   పేర్కొన్నారు.

శుక్రవారం సాయంత్రం స్థానిక టూరిజం సాయి ఆరామం ప్రక్కన  ప్రాంగణంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం  ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పి .బసంత్ కుమార్ఆధ్వర్యం లో ముస్లిం సంప్రదాయరీతలో ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో   ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంటశ్రీధర్ రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీమంత్రి పెనుకొండ శాసనసభ్యులు మాల గుండ్ల శంకరనారాయణ, కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి, మడకశిర ఎమ్మెల్యే డా. తిప్పేస్వామి ,ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామి రెడ్డి ,   రాయదుర్గం ఎమ్మెల్యే  కాపు రామచంద్రారెడ్డి, జిల్లా ఎస్పీ  రాహుల్  దేవ్ సింగ్ జాయింట్ కలెక్టర్ సిహెచ్ చేతన్ , డి ఆర్ ఓ గంగాధర్ గౌడ్ ,ఆర్ డి ఓ భాగ్య రేఖ , ముస్లిం మతపెద్దలు , మైనారిటీల నాయకులు, జిల్లా మైనార్టీ సంక్షేమ  శాఖ అధికారి  రఫీ, చాంద్ భాషా, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఇమ్రాన్  పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికిజిల్లా కలెక్టర్ అధ్యక్షత  వహించారు. తొలుత  అతిథులకు మైనారిటీసంక్షేమం శాఖ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులకు ఆత్మీయ సత్కారం చేశారు.  మౌలానాహఫీజ్ సయ్యద్ అబ్దుల్ ఖయ్యూం ఖాజీ పవిత్ర రంజాన్ మాసం యొక్క విశిష్టత పై ఉపన్యసించారు.  కార్యక్రమంలో  పాల్గొన్న ముస్లిం ఉపవాస దీక్ష కులకు దువా చదివించి  దీక్షను విరమింపజేశారు.  రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం రోజున ఈ కార్యక్రమం  ఏర్పాటు చేయడంవిశేషం.   అంతకుముందు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సామూహిక నమాజ్ ప్రార్థనల్లో పాల్గోన్నారు.  అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూసర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. అందువల్ల మైనార్టీ సోదరులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారన్నారు.అలాగే ముస్లిం సోదరులందరూ  ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ అల్లా మన్ననలు పొందాలన్నారు. ప్రతి ఒక్కరూ పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పవిత్రతను గుర్తించి అల్లా అనుసరించిన మార్గంలో నడవాలన్నారు. 


ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎక్బాల్  అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని అన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి తో పాటు నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు అలాగే ఒక ముస్లిం మహిళ కు శాసనమండలి ఉప చైర్మన్ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. అంతేగాక మునిసిపల్ మేయర్ , చైర్మన్లు, డైరెక్టర్లు ,జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ,జడ్పిటిసి ,ఎంపిటిసి కార్పొరేటర్లు ,మున్సిపల్ కౌన్సిలర్లు ,సర్పంచులు లాంటి పదవులతో  సాధికారత కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు.  

  పుట్టపర్తి ఎమ్మెల్యే   డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సోదర భావానికి ప్రతీకగా రంజాన్ మాసంలో హిందూ, ముస్లిం అనే భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు రంజాన్ వేడుకలు వివిధ రీతుల్లో నిర్వహించుకోవడం అనాదిగా వస్తున్నదని తెలిపారు. ఈ రంజాన్ మాసం లో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి ఆధ్యాత్మిక  తనతో సన్మార్గం వైపు పయనింప చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో పుట్టపర్తి జిల్లాలు అన్ని విధాలఅభివృద్ధి రంజాన్ ప్రార్థనల లో భాగంగా దైవసన్నిధిలో ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి మసీద్ ముత్తు వల్లి లు తాజ్మల్ భాష ,మహబూబ్ బాషా, పెనుగొండ మస్తాన్ బాబా ,జిల్లా నలుమూలల నుండి ముస్లిం మైనార్టీ సోదరులు, చైర్మన్  వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు  ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.