ప్రతి రోజూ లక్ష పని దినాలు సాధించాలి




రాజమహేంద్రవరం, (ప్రజా అమరావతి);



* ప్రతి రోజూ లక్ష పని దినాలు సాధించాలి 



* అందుకు అనుగుణంగా మండల పరిధిలో ప్రణాళిక సిద్ధం చేయాలి


* ఉదయం 8 గంటలకల్లా ఆరోజు పనులు నివేదిక ఇవ్వాలి


.. కలెక్టర్ డా. మాధవీలత 



జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం ద్వారా పనులు  కల్పించి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత అన్నారు.



శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో  ఉపాధి హామీ పనులు, జలకళ, టాక్స్ కలెక్షన్స్, విద్యాదీవెన, హౌసింగ్ తదితర అంశాలపై డ్వామా పిడి ఏ. వెంకటలక్ష్మి తో కలిసి కలెక్టర్  సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత  మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పనులు ఏమేమి ఉన్నాయో తెలుసుకొని అందుకు అనుగుణంగా ఆయా పనులకు ప్రాధాన్యత ఇస్తే సక్సెస్ సాధించగలన్నారు.  రబీ సీజన్ పూర్తి అయ్యిందని,  ప్రోగ్రామ్ అధికారిగా పనులు కల్పించాల్సిన బాధ్యత ఎంపిడివో లదే అన్నారు. క్షేత్రస్థాయిలో పనుల వివరాలు తెలుసుకుని లక్ష్యాలపై ప్రణాళిక సిద్ధం చెయ్యాలన్నారు.  ప్రతి రోజు ఉదయం 8 గంటలకు నివేదిక ఇవ్వాలి. మండల పరిధిలో సాధించిన ప్రగతి విశ్లేషణ చేశాను  16 నుంచి 156 శాతం వరకు లక్ష్యాలను సాధించినట్లు తెలుస్తోంది.. ఇందులో వాస్తవం లేదని తదుపరి తెలిస్తే వాటికి బాధ్యత  ఎంపీడీఓ లదే అన్నారు.  గోపాలపురం, అనపర్తి మండలాల్లో సగటు వేతనాలు చెల్లింపులో తక్కువగా ఉండడానికి కారణమేమిటని అడిగారు. బిక్కవోలు లో కేవలం 412 పనిదినాలు లక్ష్యం సాధించడడంపై వివరాలు తెలుసుకుని,  ఇంత తక్కువ లక్ష్యం కోసం ఇంత మంది సిబ్బంది అవసరమా అని ప్రశ్నించారు. పనీతీరును మెరుగుపరుచుకోవడానికిచొరవచూపాలన్నారు. కడియం, బిక్కవోలు, రాజమహేంద్రవరం రూరల్  పరిధిలో లక్ష్యాలు తక్కువగా సాధించడం పై వివరణ కోరారు. జిల్లాలో  ఎక్కువ పనిదినాలు లక్ష్యాలను నిర్దేశించుకున్న రంగంపేట , రాజానగరం, కోరుకొండ, గోకవరం, సీతానగరం మండలాల్లో  లక్ష్యాలను చేరడానికి నిర్దేశించుకున్న  ప్రణాళికలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. తక్కువ వేతనాలు చెల్లింపులు జరుగుతున్న గోపాలపురం, దేవరపల్లి మండలాలు సగటు చెల్లింపులు స్థాయి పెరిగేలా చూడాలన్నారు. 


కొన్ని మండలాలు తక్కువ మాండీడేస్ (పనిదినాలు) చూపడం జరిగిందని, అలా అయితే జిల్లా లక్ష్యాలను ఎలా సాధించగలం అని కలెక్టర్ ప్రశ్నించారు. హౌసింగ్ పనిదినాలు కూడా ఎన్ ఆర్ ఈ జీ ఎస్ కింద తీసుకోవాలన్నారు. ఇంటి నిర్మాణాలు ఏ ఏ దశల్లో ఎన్ని పనిదినాలు ఉంటాయో తెలుసుకుని వాటిని కూడా లక్ష్యాల్లో పొందుపరచాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు  అమలు మేరకు క్షేత్రస్ధాయిలో పనులుచేపట్టాలన్నారు. బేస్మెంట్ స్థాయిలో 28 పనిదినాలు అందుబాటులో ఉంటాయన్నారు.   ప్రతి గురువారం వొచ్చే వారానికి ఉపాధిహామీ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మీకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి, ఇందులో మరో మాటకి తావులేదు. సమస్యవలన చెయ్యలేదని చెప్పవద్దని, ఏ రోజు సమస్య ఆరోజే తన దృష్టికి తీసుకుని వొచ్చి పరిష్కారం చూపాలన్నారు. సాంకేతిక సమస్యలపై  చర్చించి వాటికి పరిష్కారం చూపడానికి చొరవ చూపాలని, ఏదో ఒక కారణం చెప్పి లక్ష్యాలను చేరలేదు అనడం ఉపేక్షించ నన్నారు.  మండల పరిధిలోని అందరూ కలిసి సమిష్టిగా పనిచేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో పలు చోట్ల అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ లు ఉన్నాయని, వారి నుంచి రుసుములు వసూలు చేయాలన్నారు.  ఇకపై వారానికి ఒక గ్రామం పర్యటిస్తానని తెలిపారు.  రహదారుల ప్రక్కన అడ్వర్టైజ్మెంట్ బోర్డు లు ఉన్నాయన్నారు. వాటికి రుసుములు విధించి వసూలు చేయాలన్నారు.  రుసుము సర్టిఫికేట్  వివరాలు ఆయా బోర్డ్లపై ప్రదర్శించాలన్నారు.


ఈ సమావేశంలో డ్వామా పిడి ఏ. వెంకటలక్ష్మి , ఏపిడి లు,  డివిజన్డెవలప్మెంట్ అధికారి, ఎంపిడివో లు, టెక్నికల్ అసిస్టెంట్ లు,  సిసి లు తదితరులు హాజరయ్యారు.


Comments