సోదరభావానికి ప్రతీక ఇఫ్తార్ విందు



**సోదరభావానికి ప్రతీక  ఇఫ్తార్ విందు*



 *రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ భాష....* 


కడప, ఏప్రిల్ 21(ప్రజా అమరావతి):- రంజాన్ పవిత్ర మాసం లో ఇఫ్తార్ విందు హిందూ ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని, సోదరభావానికి ప్రతీక  ఇఫ్తార్ విందు..అని  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, యస్ బి. అంజాద్ భాష పేర్కొన్నారు.


గురువారం  పట్టణంలోని  మృత్యుంజయ కుంట లోని నవాబ్-ఈ మసీదు నందు ఎస్కే మోటార్స్ సందాని ఆధ్వర్యంలో  పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీదు ప్రెసిడెంట్  సంజానీ  ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి యస్ బి. అంజాద్ భాష మాట్లాడుతూ....30 రోజులపాటు ముస్లిం లు కఠినమైన ఉపవాస దీక్ష చేపడతారని, ఉపవాస దీక్ష ముగిసే సమయంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారన్నారు. 

ఈ క్రమంలో నవాబ్- ఏ మసీదు వారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు.


సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే ఈదుల్ ఫితర్(రంజాన్) ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. అందువల్ల మైనార్టీ సోదరులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారన్నారు.అలాగే ముస్లిం సోదరులందరూ  ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ అల్లా మన్ననలు పొందాలన్నారు. ప్రతి ఒక్కరూ పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పవిత్రతను గుర్తించి అల్లా అనుసరించిన మార్గంలో నడవాలన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా కడప జిల్లా ప్రజలందరికీ ఉప మంత్రివర్యులు పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో మేయర్ సురేష్ బాబు,వైయస్సార్సిపి సీనియర్ నాయకులు సుభాన్ బాబు,టిడిపి నాయకులు అమీర్ బాబు, కార్పొరేటర్లు మల్లికార్జున, భాస్కర్, షఫీ, వైయస్సార్సిపి నాయకులు  మౌలాలి తుపాకుల రమణ,తదితరులు పాల్గొన్నారు.



Comments