ప్రతి గ్రామానికీ లక్షల్లో లాభం*
*వైఎస్సార్ సున్నా వడ్డీ నిధుల విడుదల చేయడంతో ఆనందం వ్యక్తం చేసిన డ్వాక్రా మహిళలు*
పుట్టపర్తి, ఏప్రిల్ 22 (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన సభ నుంచి బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ మూడో విడత నిధులు విడుదల చేశారు.
ఈ కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ వీక్షించారు. అనంతరం జిల్లా డ్వాక్రా మహిళలు పొందిన రూ.60.90 కోట్ల చెక్కును వారికి అందజేశారు.
ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు తమ ఆనందాన్ని ఇలా పంచుకున్నారు.
*గ్రామ గ్రామానికీ లక్షల్లో నిధులు*
: సాయి లీల, లింగా రెడ్డి పల్లి, కొత్త చెరువు మండలం, సాయి ఈశ్వర సంఘం
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం మూడో విడత ద్వారా మా గ్రామంలో మహిళలు రూ.30 లక్షల పైన లబ్ది పొందారు. ప్రతి గ్రామంలోనూ మహిళలకు లక్షల రూపాయల లబ్ది చేకూరింది. మహిళల చేతుల్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎప్పుడూ లేదని ఘంటాపథంగా చెప్పగలను.
కష్ట కాలంలో కూడా సంక్షేమ పథకాలతో పాటూ సున్నా వడ్డీ పథకాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు. మా సంఘానికి రూ.36,000 లబ్ది చేకూరింది.
ఇది ఒకటి పక్కన సున్నాల విలువైనది.
:అరుణ, పుట్టపర్తి ఆర్బన్, వెన్నెల సంఘం (మెప్మా)
మామూలుగా సున్నా అంటే విలువ లేనిది అనుకుంటాం. కానీ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో సున్నా మాత్రం ఒకటి పక్కన సున్నాలాగా విలువైనది. మహిళలు జీరోలుగా మిగిలిపోకుండా హీరోలుగా మార్చేందుకు అనేక పథకాల్లో సున్నా వడ్డీ పథకం ఒకటైతే, నెంబర్ వన్ నాయకుడు జగనన్న.
*ఇది మహిళల పండగ*
కలావతమ్మ, జానకం పల్లి, బుక్కపట్నం మండలం, వినాయక సంఘం.
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నిధుల విడుదల అంటే మా డ్వాక్రా మహిళల పండగ రోజు. మేం బయట ఎక్కడైనా అప్పు తెచ్చుకోవాలి అంటే వడ్డీల మీద వడ్డీలు గుంజుతారు. తెచ్చుకున్న అప్పు కంటే వడ్డీ ఎక్కువ కట్టే పరిస్థితులు బయట ఉన్నాయి. అలాంటిది మేం కట్టిన వడ్డీ డబ్బులు తిరిగి పొందడం అంటే ఎంత సంతోషంగా ఉంటుందో వడ్డీల మీద వడ్డీలు కట్టిన వాళ్లకే తెలుస్తుంది. అది చిన్న మొత్తమైనా చెప్పలేని ఆనందాన్నిస్తుంది.
మా సంఘానికి రూ.23,590 ల లబ్ది చేకూరింది.
addComments
Post a Comment