ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందించేలా సచివాలయాలు పనిచేయాలి

 

నెల్లూరు, ఏప్రిల్ 12 (ప్రజా అమరావతి) :  ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందించేలా సచివాలయాలు పనిచేయాల


ని, వివిధ సమస్యలపై ప్రజల నుంచి అందిన అర్జీలను ఎక్కడా జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. 


 మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు సమీపంలోని 32/1 శ్రీలంక కాలనీ, 37/2 రామ్ నగర్ మెయిన్ రోడ్డు సచివాలయాలను  జిల్లా  కలెక్టర్  శ్రీ చక్రధర్ బాబు తనిఖీ చేసి  ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా  సచివాలయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సచివాలయ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేసి  ఎటువంటి దరఖాస్తులు పెండింగ్ లేకుండా సత్వరం పరిష్కరించేలా  కృషి చేయాలన్నారు. ఓటిఎస్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 

కలెక్టర్ వెంట నెల్లూరు రూరల్ తాసిల్దార్ శ్రీ షఫీ మాలిక్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments