హౌసింగ్ పై సమగ్రంగా పనుల వారీగా కలెక్టర్ సమీక్ష

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);



హౌసింగ్ పై సమగ్రంగా పనుల వారీగా కలెక్టర్  సమీక్ష



క్షేత్రస్థాయిలో అధికారులు, ఇంజనీర్లు మరింత గా దృష్టి సారించాలి


కలెక్టర్ డా.కే. మాధవీ లత 




జగనన్న కాలనీల్లో తక్షణమే చేపట్ట వలసిన 

మౌలిక సదుపాయాల కల్పన కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. 


శనివారం సాయంత్రం స్థానిక నగరపాలక సంస్థ కార్యాయంలో హౌసింగ్ పై సమగ్ర సమీక్ష సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ,  పనులు చేపట్టడం లో టెండర్ కారణంగా చూపి జాప్యం జరిగేతే సహించనని స్పష్టం చేశారు. జగనన్నకాలనీల్లో చేపట్టవలసిన పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరగాలని, చేపట్టవలసి న పనులకు చెల్లింపు కి జాప్యం జరిగే అవకాశం లేదని తెలిపారు.  కాంట్రక్టర్లకు ఎంత మొత్తం చెల్లింపు లు జరగాలో నివేదిక అందజేస్తే ప్రభుత్వం నుంచి నిధుల విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సి ఎఫ్ ఎమ్ ఎస్ ద్వారా చెల్లింపులు ఆలస్యం అవుతుంది అనే భావనలో ఉన్నారు, కానీ వీటికి నేరుగా చెల్లింపు లు జరుగుతాయన్న విషయం తెలుసుకోవాలని ఆమె పేర్కొన్నారు.



జిల్లాలో మొత్తం 56 పనులను చేపట్టవలసి ఉందని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో  21 పనుల్లో పురోగతి,  కోరుకొండ పరిధిలో ప్రధాన రహదారి కి అనుసంధాన రహదారి పై, పాలచర్ల , మునిసిపల్  తదితులున్నారు పనుల వారీగా సమీక్ష నిర్వహించారు. కాలనీల్లో కి వెళ్ళే రహదారి పనులను వీలైనంత త్వరగా చేపట్టాలన్నారు.  ఇప్పటి వరకు 5 శాతం పనులు పూర్తి చేసిన వాటిపై సమీక్ష చేస్తూ, వేగవంతం చేయాలని ఆదేశించారు. కడియం, కోరుకొండ, బురుగుపూడి, కనుపురు, కోటి, మధురపూడి, నడిగట్ల, పాలచర్ల-2, మల్లంపుడి, పుషోత్తపట్నం , గుమ్మల్ల పూడి, కొవ్వూరు అర్బన్, వాటి పనుల వారీగా యదార్ధ స్థితి పై సమగ్రంగా సమీక్ష చేశారు. ఇంజనీర్లు ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయి లో పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ లతో పనుల్లో పురోగతి సాధించాలన్నారు. డివిజనల్ ఇంజనీర్లు లాగిన్ లో పనులు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, హౌసింగ్ పిడి తి. తారా చంద్, ఈ ఈ ఆర్ ఆర్ సోములు, డీ ఈ పరుశురాం,  హౌసింగ్, టెక్నికల్ అసిస్టెంట్ లు తదితులు హాజరయ్యారు. 

Comments