రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
* తూర్పు గోదావరి జిల్లా రైతులకు విజ్ఞప్తి జూన్ 1న కాలువల కాలువల ద్వారా సాగుకు నీటిని విడుదల చేస్తాం
* నేను పాలకుడిని కాదు సేవకుడిని అనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలి
* ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా రైతులు అడుగులు వేయాలి
* ప్రకృతి విపత్తుల నుండి రైతులను కాపాడాలి అన్నది సీఎం ఆలోచన...
పత్రికా విలేఖరుల సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, ఉభయ గోదవరి జిల్లాల జెడ్పీ చైర్మన్లు వి. వేణుగోపాల్ రావు, కవురు శ్రీనివాస్ లు
మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ
బుధవారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో
జిల్లా ఇంఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాల కృష్ణ మాట్లాడుతూ, సుమారు నాలుగు గంటల సమయం జిల్లా సమీక్షా సమావేశం లో పలు సంక్షేమ,అభివృద్ధి అంశాలు, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు. జిల్లాకు నూతన కలెక్టర్ గా వచ్చిన మాధవి లత వారి ఆధ్వర్యంలో తొలి సమావేశం చక్కగా నిర్వహించామని ఇది టీం వర్క్ ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి ప్రాధాన్యత అంశాలపై తెచ్చామని దేశంలో ఎక్కడా లేని విధంగా 33 లక్షల మంది ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టామన్నారు. గజం ఇంటి స్థలం లేని పేదలకు ఏడేనిమిది లక్షలు ఖరీదు చేసే భూమిని ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఆర్థిక చేయుతను అందిస్తున్నామన్నారు. ఇల్లు లేని పేదలకు సొంత ఇంటి కళ నెరవేర్చాలని ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా ఇప్పటికే 90% మంది ప్రజలు ఇంటి నిర్మాణాలు పల్లె పనులను చేపట్టారన్నారు. మిగిలిన 10 శాతం స్థానిక ఇబ్బందులు తదితర కారణాలతో జాప్యం జరుగుతోందని వాటికి కూడా త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. ఇప్పటికే ఇంటి నిర్మాణాలు చేపట్టిన పూర్తి చేసిన కాలనీలో సదుపాయాలు త్రాగు నీరు విద్యుత్ రోడ్ల తదితర పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ అంశాలు సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని మంత్రి వేణు గోపాల కృష్ణ తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా చరిత్రలో గత 20 సంవత్సరాలుగా చూడని విధంగా జూన్ ఒకటో తేదీ కాలువలకు సాగు నీరు అందించి పంటలు వేసే పరిస్థితి కల్పిస్తున్నామని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ అన్నారు. ఆలస్యంగా పంట వేస్తే ప్రకృతి విపత్తులకు తుఫాను, వరదలు వలన అపారంగా నష్టపోయిన రైతులకు ఆ సమస్య రాకుండా ముందస్తు పంటను వేసుకునే ఈ విధంగా కాలువల ద్వారా సాగునీరు అందిస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతుల కోసం ఇంతగా ఆలోచించే ముఖ్యమంత్రి మరొకరు లేరన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సకాలంలో అందించడం ద్వారా రైతులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. రైతులు ఏ పంట వేస్తున్నారు దానికి గిట్టుబాటు ధర కల్పించడం జరిగిందన్నారు. ప్రకృతి బారిన పడి రైతులు కాకుండా నష్టపోకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవడం ద్వారా రైతులకు భరోసా ఇవ్వగలమో ఆలోచన చేస్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతు యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ మార్కెటింగ్ తదితర శాఖలతో జాయింట్ కలెక్టర్ చర్యలు తీసుకోవడం సమన్వయం చేస్తున్నారని తెలిపారు. ఈ క్రాప్ బుకింగ్ విధానాల్లో లోటుపాట్లను సరి చేసి రైతులకు అండగా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నా రన్నారు. రైతులు ఆలోచన చేయాలని ఈ ప్రభుత్వం ఏ సీజన్లో అయితే రైతుకు నష్టం వాటిల్లిందో, అదే సీజన్లో ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులను మోసగిస్తే ఈ ప్రభుత్వం అడుగడుగున రైతులకు భరోసా కలిగిస్తోందన్నారు. జూన్ 14న రైతుల కోసం ఇన్సూరెన్స్ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు లక్ష నాలుగు వేల కోట్ల మేర ప్రయోజనాన్ని రైతులకు కల్పించామన్నారు. రైతు భరోసా ద్వారా రూ.23,075 లక్షలు రైతులకు అందించామన్నారు. రైతుల కోసం ఆలోచనలు చేసి ముందస్తుగా నీటిని విడుదల చేస్తున్నందున జూన్ 1న పంటలు వేసుకునేందుకు రైతులు సిద్ధంగా ఉండాలన్నారు.
నాడు నేడు పాఠశాల అభివృద్ధి, త్రాగునీటి సరఫరా, హార్టికల్చర్ సిరికల్చర్ అనుబంధం వ్యవసాయ రంగాలపై సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం సామాన్యులకు, నిరుపేదలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి దిశా నిర్దేశం పని చేస్తున్నామని మంత్రి తెలిపారు. "జగన్ అంటే నిజం" అని నాడు అన్నాను నేడు "జగన్ అంటే భరోసా" అని అంటున్నానని మంత్రి పేర్కొన్నారు. పేదవాడికి భరోసా ఈ ప్రభుత్వాన్ని పిలిచే లాగా గర్భస్థ శిశువు నుండి ముదసలి వరకు భరోసా కల్పిస్తూ నాది ఈ ప్రభుత్వం అనే తరహాలో సంక్షేమ పాలన అందిస్తోందన్నారు. ఈరోజు జరిగిన జిల్లా సమీక్ష సమావేశం ఎంతో చక్కటి వాతావరణం జరిగిందని ప్రజా ప్రతినిధులు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చి చర్చించి చక్కటి పరిష్కార మార్గాలు సూచనలు చేయడం ప్రజా ప్రతినిధుల ప్రశ్నలకు వారిని సంతృప్తి చేసేలా అధికారులు వివరణ ఇవ్వడం జరిగిందని అన్నారు. తదుపరి సమావేశం నాటికి అధికారులు మరింత సమగ్ర నివేదికలతో, సమాచారంతో హాజరు కావాలని పేర్కొన్నారు. .
నేను పాలకుడిని కాదు సేవకుడిని అనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించాలని మంత్రి కోరారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యము కీలకమన్నారు. అదే ఆశయసాధనతో పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలియజేశారు
ప్రజలందరికీ మంచి చేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఈరోజు జరిగిన తూర్పు గోదావరి జిల్లా సమీక్షా సమావేశంలో గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు సమీక్షించడం జరిగిందన్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అందరితో కలిసి జిల్లాలు అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హౌసింగ్ కార్యక్రమం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. జగనన్న కాలనీ లో ఏ విధంగా మౌలిక వసతులు కల్పించాలి ఈ అంశంపై అధికారులకు దిశా నిర్దేశం చేయమన్నారు అధికారులు కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. వ్యవసాయం ఉపాధి హామీ పనులపై సమీక్షించామని, జిల్లాలో రైతులు కోతలను(హార్వెస్టింగ్) చేస్తున్నారని జరుగుతున్నాయని, ధాన్యం సేకరణ కొనుగోలు అంశాలపై రైతులకు అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నామన్నారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం ద్వారా అధికారులతో పాటు ప్రజలు కూడా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు పరిష్కారం చూపేందుకు జగనన్న పరిపాలన వికేంద్రీకరణ ఎంత దోహదం చేస్తున్నదన్నారు. జిల్లా స్థాయి నుండి మండల స్థాయి, గ్రామస్థాయి వరకు పరిపాలనను అందించడం సాధ్యమైందన్నారు. ప్రజలకు సంబంధించిన చిన్న సమస్య అయినా జిల్లా కలెక్టర్ స్థాయి నుండి చర్చించి పరిష్కారం చూపేందుకు అవకాశం ఏర్పడినట్లు మంత్రి తానేటి వనిత తెలిపారు. సమావేశంలో చర్చించిన సమస్యలకు తదుపరి సమావేశానికి పరిష్కారం చూపడం జరుగుతుందని, తక్షణ పరిష్కారం చూపే విషయంలో అధికారులకు సూచనలు చేశామన్నారు. సమావేశం ఎంతో ఫలవంతం అయిందని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు చర్చించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని , వారి సూచనలను పరిగణన లోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. సమస్యలను జిల్లా స్థాయిలోనే పరిష్కారం చూపుతామని ఒకవేళ రాష్ట్రస్థాయిలో తీసుకోవలసిన నిర్ణయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపుతామన్నారు.
addComments
Post a Comment