జిల్లాలోని 10,689 మంది మత్స్యకారులకు వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 10.689 కోట్ల రూపాయలు అందజేతనెల్లూరు, మే 13 (ప్రజా అమరావతి):- రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని  10,689 మంది మత్స్యకారులకు వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 10.689 కోట్ల రూపాయలు అందజే


స్తోందని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. 


శుక్రవారం ఉదయం కోనసీమ జిల్లాలోని  మురమళ్ళ గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా నాలుగవ ఏడాది వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 1,08,755 మంది మత్స్యకారులకు 109 కోట్ల రూపాయలను , ఓ ఎన్ జీ సి పైప్ లైన్ కారణంగా జీవన ఉపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు కూడా 108 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మొత్తం కలిపి 217 కోట్ల రూపాయలను కంప్యూటర్ బటన్ నొక్కి  వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా నుంచి పాల్గొన్న అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు జిల్లాలోని 10,689 మంది మత్స్యకారులకు సంబంధించి 10.689 కోట్ల రూపాయల మెగా నమూనా బ్యాంకు చెక్కును వారికి పంపిణీ చేశారు. 


 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు.  జిల్లాలో 120 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉందన్నారు.  జిల్లాలో మత్స్యకారులు ఎప్పటి నుంచో ఒక గొప్ప కలగాఎదురు చూస్తున్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్  త్వరలో సాకారం కానుందన్నారు.  దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో హార్బర్ నిర్మాణం కానుందని తద్వారా 3500 మత్స్యకార కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జిల్లాలో తీరం వెంబడి ఇప్పటికే కృష్ణపట్నం ఓడరేవు నడుస్తోందని మరో ఓడరేవు రామాయపట్నం వద్ద  నిర్మించేందుకు త్వరితగతిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం 850 ఎకరాల భూసేకరణ కార్యక్రమం పూర్తికావస్తోందన్నారు.  త్వరలోనే ఈ ఓడరేవుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారన్నారు.  ఈ రెండు ఓడరేవుల మధ్య ఉన్న ప్రాంతం అంతా  ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. జిల్లాలోని మత్స్యకారుల

మేలుకోసం కొన్ని ఓడరేవు ఆధారిత పరిశ్రమలు రానున్నాయన్నారు. ఈ పరిశ్రమల వలన జిల్లాలోని యువతకు సుస్థిరమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభించనున్నాయన్నారు.  రాష్ట్రంలో ప్రజల కోసం వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ముఖ్యంగా మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛను మంజూరు చేయడం, ఒక లీటర్ డీజిల్ కు తొమ్మిది రూపాయలు సబ్సిడీ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఆక్వా రైతులకు ప్రతి యూనిట్కు 2-40 రూపాయలకే  విద్యుత్ సరఫరా అందించడం వలన మరింత ఎక్కువ సంఖ్యలో మత్స్య సంపద ఉత్పత్తి  పెరుగుతోందన్నారు.  ప్రతి సంవత్సరం ప్రాథమిక రంగం లో  ఉత్పత్తులు పెరుగుదల కనిపిస్తోందన్నారు. జిల్లాలో 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల మేరకు నాణ్యమైన ఉత్పత్తులు దేశవిదేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుందన్నారు. జిల్లాలో మత్స్య సంపద ఆక్వా రంగం బలోపేతం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు.  ఆంధ్ర ఫిష్ పేరుతో మత్స్యకారులకు మార్కెటింగ్ సౌకర్యం పడవలు, వలలు అన్ని కూడా సబ్సిడీ ధరలతో అందించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందన్నారు.  ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఈ నిధులతో  జిల్లాలో మత్స్య సంపద పెంపుదలకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. 


కొందరు మత్స్యకారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. 


1. కుమారి శ్రీనివాసులు  కుమ్మరపెంట గ్రామం కావలి మండలం.


తాము రెండు నెలలుగా వేట నిషేధం కాలంలో జీవనోపాధి కోల్పోయి చాలా బాధపడే వారమని రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు అందజేసి తమని అన్ని విధాల ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.  గత మూడు సంవత్సరాలుగా తమకు పది వేల రూపాయల చొప్పున అందుతుందన్నారు. తమ ప్రాంత  మత్స్యకారులు అంతా వేటకోసం కర్ణాటక బెంగుళూరు కు వెళ్లి ఇబ్బందులు పడేవారని ఇప్పుడు మా ప్రాంతంలోని జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ రానుండడం  ఎంతో ఆనందంగా ఉందని తమను అన్ని విధాల ఆదుకుంటున్న ముఖ్యమంత్రి జగనన్నకు ఎంతగానో రుణపడి ఉంటామని చెప్పారు.


2. మామిడి గోవింద స్వామి బంగారుపాలెం బోగోలు మండలం.


వేట నిషేధ కాలంలో గత ప్రభుత్వం తమకు 4 వేల రూపాయలు ఇచ్చేదని ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.  గతంలో  డీజిల్కు ఆరు రూపాయలు సబ్సిడీ అని  చెప్పినప్పటికీ కొంతమందికి మాత్రమే వచ్చేదని, బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియదని, నేడు పెట్రోల్ బంక్ దగ్గరే తొమ్మిది రూపాయలు తగ్గించుకొని డీజిల్ ను అందించడం చాలా గొప్ప విషయమన్నారు.  అందులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.  జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వస్తుందని 10-15 సంవత్సరాలుగా చెబుతున్నారు గాని అది ఏమాత్రం జరగలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం నేడు  దాని నిర్మాణం జరుగుతుండడం ఆనందంగా ఉందన్నారు.  


3.  ఎల్లం గారి వెంకటేశ్వర్లు సివిఆర్ రామలింగాపురం ముత్తుకూరు మండలం. గతంలో తమకు 4 వేల రూపాయలు వేట నిషేధ భ్రుతి ఇచ్చేవారని నేడది 10 వేల రూపాయలకు పెంచి ఇవ్వడం చాలా గొప్ప విషయం అన్నారు.   దీనితో తమ ప్రాంతంలో ఒక పండుగ వాతావరణం నెలకొందన్నారు.  అలాగే గతంలో  డీజిల్ కు 6 రూపాయలు ఇస్తున్న సబ్సిడీ నేడు 9 రూపాయలకు పెంచడం సంతోషంగా ఉందన్నారు.  గతంలో తాము ఎవరైనా వేట కోసం సముద్రంలో వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవారని నేడది 10 లక్షల రూపాయలకు పెంచి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు శ్రీ నాగేశ్వరావు, జిల్లా నలుమూలల నుంచి పలువురు  మత్స్యకారులు పాల్గొన్నారు.

Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image