రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
* ఈ నెల 12 లేదా 13 తేదీల్లో డీఆర్సీ సమావేశం
..
* అధికారులు వారి శాఖల నివేదికలతో సిద్దంగా ఉండాలి
* ఈ రోజు స్పందనలో 140 ఫిర్యాదులు అందాయి.
- కలెక్టర్ డా. కె. మాధవీలత
ప్రజల సమస్యల పరిష్కార వేదిక స్పందన లో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా అర్జీ దారునికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. .
సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తదితర జిల్లా అధికారులతో కలిసి డా. మాధవీలత ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ ఈ వారం ప్రజల నుంచి 140 అర్జీదారులు స్పందన ఫిర్యాదులు అందచేసారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కి అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేసిందన్నారు. ప్రజా సమస్యలకు క్షేత్ర స్థాయిలో పరిష్కారం చూపే ప్రయత్నం లో భాగంగా ప్రతి నియోజకవర్గ పరిధిలో స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యడం జరుగుతోందన్నారు. ఒక వారం జిల్లా కలెక్టరేట్ నందు మరో వారం నియోజకవర్గ పరిధిలో స్పందన నిర్వహించడం ద్వారా జిల్లా యంత్రాంగం ప్రజలతో మమేకమౌవడానికి అవకాశం ఉందని తెలిపారు.
నూతనంగా జిల్లా వ్యవస్థ ఏర్పాటు చేసిన దృష్ట్యా వైద్య - ఆరోగ్య, రెవెన్యూ, మైన్స్, గ్రౌండ్ వాటర్, జలవనరుల, ఆర్.డబ్ల్యు.ఎస్, పిఆర్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, ఆర్ అండ్ బి, ఎస్సీ బీసీ మైనార్టీ సంక్షేమం వంటి తదితర శాఖలకు సంబంధించిన రాష్ట్ర అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు కలెక్టర్ దృష్టికి తీసుకుని రావాలని కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. అందులో భాగంగా ఆయా శాఖలు జిల్లా లో రూపొందించిన ప్రణాళికలు తయారు చేయాలన్నారు. అదేవిధంగా క్షేత్ర స్థాయిలో జిల్లా అధికారులు పర్యటించే వివరాలు
ఏ రోజుకారోజు జిల్లా అధికారుల వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ చెయ్యలని పేర్కొన్నారు. అదేవిధంగా నివేదికలు సమర్పించాలని తెలిపారు.
మే 12, 13 తేదీల్లో ఒకరోజు జిల్లా సమీక్ష కమిటీ సమావేశం (DRC) నిర్వహించ నున్నట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఆ సమావేశానికి సంబందించిన అంశాలతో ఆయా శాఖలు సమగ్రమైన సమాచారాన్ని అందచేయ్యలన్నారు. మంగళ వారం సాయంత్రం జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి (DRC)జిల్లా ఇంఛార్జి మంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరవ్వడం జరుగుతుందన్నారు. సమావేశంలో శాఖల వారి ప్రగతిని వివరించేందుకు అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాల్సి ఉంటుందన్నారు
రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణాలను నిర్ణీత సమయం పూర్తి చెయ్యాలనే ఉద్దేశంతో ఉందని, అందులో భాగంగానే స్వయం సహాయక సంఘాలు మహిళలకు డిఆర్డీఏ, మెప్మా ద్వారా రు.35-50 వేలు వరకు రుణ సౌకర్యం కల్పిస్తుందని, ప్రభుత్వం ఇంటి స్థలం తో ఇంటి నిర్మాణానికి సంబంధించి రూ.1,80,000 లను ఆర్థిక సహాయం చేస్తోందన్నారు. ఇంటి నిర్మాణంకి అవసరమైన సిమెంట్, ఐరన్, ఇసుక వంటి ముడి సరుకులు కూడా సరసమైన ధరలకు లే అవుట్ వద్దే అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలో అన్ని రెవెన్యూ, మండల, సచివాలయాలలో ప్రజలనుంచి అర్జీలు సంబందించిన అధికారులు, సిబ్బంది స్వీకరించారన్నరు. ఈరోజు ప్రజల నుంచి 140 స్పందన ఫిర్యాదులు అందయన్నారు. సామాజిక పెన్షన్, భూమి సంబంధ అంశాలు, ఇండ్ల స్థలాలు, భూముల సరిహద్దు వివాదాలు, రేషన్ కార్డులు, ఇసుక, గృహ నిర్మాణం, తదితర సమస్యల పరిష్కారం కొరకు అర్జీ లను అందచేశారన్నారు.
ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించడం జరుగుతోందని, వాటి పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పై మండల ప్రత్యేక అధికారులు దృష్టి సాధించి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ స్పందన కార్యక్రమం లో జేసీ సిహెచ్. శ్రీధర్, డీఆర్వో బి. సుబ్బారావు, జిల్లా అధికారులు డిఎంహెచ్ఓ డా. ఆర్.స్వర్ణలత, డిహెచ్ఓ బి. తారాచంద్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్. మాధవరావు, సీపీఓ శ్రీమతి పి.రాము, డిఎమ్ సివిల్ సప్లై కె.తులసి, డిఎస్ఓ పి.ప్రసాదరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.ఎస్టిజి సత్యగోవిందం, డీఈఓ అబ్రహం, డీఎస్ ఈడబ్ల్యూ & ఈఓ ఎమ్ ఎస్ శోభారాణి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment