ఈనెల 12న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
అమరావతి,మే 10 (ప్రజా అమరావతి):ఈనెల 12 వతేది గురువారం మధ్యాహ్నం 3 గం.లకు అమరావతి సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ యుఓ నోటు ద్వారా అన్ని శాఖల కార్యదర్శులకు ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈసమావేశం ఈనెల 13వతేది ఉ.11గం.లకు జరగాల్సి ఉందని అనివార్య కారణాలతో మంత్రివర్గ సమావేశాన్ని 12వతేది గురువారం మధ్యాహ్నం 3గం.లకు మార్పు చేయడం జరిగిందని సిఎస్ తెలియజేశారు.
addComments
Post a Comment