ఈరోజు స్పందన 143 ఫిర్యాదులు అందాయి



రాజమహేంద్రవరం, (ప్రజా అమరావతి);


ఈరోజు  స్పందన 143 ఫిర్యాదులు అందాయి



18 వ తేదీ జరిగే డి ఆర్ సి కి అధికారులు పూర్తి సన్నద్ధంగా ఉండాలి


- జాయింట్ కలెక్టర్ శ్రీధర్


జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 143 మంది ఫిర్యాదులు అందజేశారని జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ వెల్లడించారు



సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజల నుంచి డిఆర్ఓ గలిసి ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ  స్పందనలో వచ్చే ప్రజలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి  నిర్ణీత సమయంలోనే సమస్య పరిష్కారం చూపాల్సి ఉందన్నారు.  ఫిర్యాదుదారులలో మాట్లాడుతూ ఆయా శాఖల ద్వారా పరిష్కరించాల్సిన అర్హమైన ఫిర్యాదులను తక్షణం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మార్గదర్శకాలు లోబడి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో విషయంలో ఎటువంటి జాప్యం ఉండదని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయల వ్యవస్థ ద్వారా  ప్రజలకు పౌర అందించడం జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రజలు స్పందన ఫిర్యాదులను మీ సమీపం లోని గ్రామ వార్డు సచివాలయం లో, రెవెన్యూ డివిజన్ , మండల కార్యాలయంలో ఇవ్వవచ్చునని తెలిపారు. 

ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ స్పందన ఫిర్యాదులు పరిష్కారం ఈ విషయంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి, ప్రతి గురువారం   రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ 18 బుధవారం జగనన్న డి ఆర్ సి ఈ సమావేశానికి అధికారులు పూర్తి నివేదికలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆ సమావేశానికి సంబంధించి శాఖల వారీగా అధికారులతో సమీక్ష చేస్తారన్నారు.



స్పందన కార్యక్రమం లో డీఆర్వో ఏ. సుబ్బారావు, జిల్లా అధికారులు పిడి ఐ డి డి ఎస్  విజయ కుమారి, డ్వామా పిడి పి. జగదాంబ,  డిఎంహెచ్ఓ డా. స్వర్ణలత, డిహెచ్ఓ బి. తారాచంద్,  సీపీఓ శ్రీమతి పి.రాము, డిఎమ్ సివిల్ సప్లై కె.తులసి, డిఎస్ఓ పి.ప్రసాదరావు,  ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


Comments