*వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష.*
*రైతు భరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, ఖరీఫ్ సన్నద్ధత, కిసాన్ డ్రోన్లు, మిల్లెట్ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష.*
*మే 16న రైతు భరోసా.*
*జూన్ 15 లోగా రైతులకు పంట బీమా పరిహారం.* *అదే నెలలో 3వేల ట్రాక్టర్లు సహా, 4014 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ. 402 హార్వెస్టర్లను కూడా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు ఇస్తున్న ప్రభుత్వం.*
*రైతు భరోసా కేంద్రాలు ఎఫ్‌ఏఓ చాంఫియన్ అవార్డుకు ఎంపికైన నేపధ్యంలో వ్యవసాయ శాఖ అధికారులను అభినందించిన సీఎం శ్రీ వైయస్.జగన్.*
*తోటబడి కార్యక్రమంలో మామిడి, అరటిపై కరదీపిక విడుదల చేసిన సీఎం*
*బ్యాంబు ట్రీ (వెదురు) బై ప్రొడక్ట్స్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి.*
అమరావతి (ప్రజా అమరావతి);
*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:*
*మే 16న రైతు భరోసా, జూన్ 15లోగా పంట బీమా పరిహారం చెల్లింపు
:*
– ఖరీఫ్ సీజన్ నాటికి రైతుల చేతిలో పెట్టబడులు పెట్టేలా కార్యాచరణ ఉండాలి: సీఎం
– మే 16న రైతు భరోసా ఇవ్వాలి:
– జూన్ 15 లోగా రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి:
– దీనివల్ల ఖరీఫ్ సీజన్ నాటికి రైతుల చేతిలో పెట్టుబడులు పెట్టినట్టు అవుతుంది, వారికి చాలా వరకు ఉపయోగపడుతుంది:
– జూన్ మొదటివారంలోనే రైతులకు 3వేల ట్రాక్టర్లతో కలిపి 4014 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ
– 402 హార్వెస్టర్లను కూడా కమ్యూనిటీ హైరింగ్‌సెంటర్లకు ఇస్తున్న ప్రభుత్వం
– అలాగే మే 11న మత్స్యకార భరోసా:
*ఇ– క్రాపింగ్ చాలా ముఖ్యమైనది:*
– ఆర్బీకే, ఇ– క్రాపింగ్ అన్నవి చాలా ముఖ్యమైన అంశాలు:
– గ్రామస్థాయిలో ఆర్బీకేల కార్యకలాపాలు, ఇ– క్రాపింగ్ ఈ రెండు అంశాలూ మిళితం కావాలి:
– ఆర్బీకేల ద్వారా కార్యకలాపాలు సమగ్రంగా ఉండాలి:
– ఆర్బీకే కార్యకలాపాలు సమర్థవంతంగా, పారదర్శకంగా ఉండాలి:
– సోషల్ ఆడిట్ కూడా సక్రమంగా నిర్వహించి రైతులకు పథకాలు వర్తింపు చేయాలి:
– పంటల బీమా దగ్గర నుంచి ప్రతి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ఆర్బీకేల్లో ఉంచాలి:
– దీనికోసం ఎస్‌ఓపీలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలి:
– సీఎంయాప్ పనితీరుమీద అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలి:
– పంటలకు ఎక్కడ మద్దతు ధరలు లభించకపోయినా వెంటనే అధికారులు స్పందించాలి, రైతులను ఆదుకునే చర్యలను తీసుకోవాలి:
– ఆర్బీకేల్లో కియోస్క్‌లు సమర్థవంతంగా పనిచేయాలన్న సీఎం.
– ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉండేలా చూసుకోవాలన్న సీఎం.
*వ్యవసాయ ఉత్పత్తుల్లో పెరుగుదల:*
– రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితులను వివరించిన అధికారులు.
– 2021 ఖరీఫ్‌లో 90.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగు.
– రబీ 2021–22లో 54.54 లక్షల ఎకరాల్లో పంటసాగు.
– 2020–21లో ఆహార ఉత్పత్తులు 165.07 లక్షల మెట్రిక్ టన్నులు, 2021–22లో 171.7 లక్షల మెట్రిక్ టన్నులు.
– గత ఏడాదితో పోలిస్తే.. ఈఏడాది 4శాతం అధికంగా వ్యవసాయ ఉత్పత్తులు.
– 2021 ఖరీఫ్‌లో వరి, మినుములు, పెసలు, పత్తి ఉత్పత్తులు గత ఏడాదితో పోలిస్తే.. పెరుగుదల.
– 2021–22రబీలో ఆశాజనకంగానే వ్యవసాయ ఉత్పత్తులు
– రాష్ట్రంలో అనుకూల పరిస్థితులతో వరుసగా మూడో పంటకూ రైతులు.
– ఇప్పటివరకూ 66,803 హెక్టార్లలో మూడోపంట సాగు రికార్డు.
– ఇది లక్ష హెక్టార్లు దాటే అవకాశాలున్నాయన్న అధికారులు.
– గత ఏడాదితో పోలిస్తే 477శాతం పెరిగిన మూడో పంట సాగు విస్తీర్ణం.
*ఖరీఫ్‌కు సర్వం సిద్ధం:*
– ఖరీఫ్ 2022కు పూర్తిగా సన్నద్ధమయ్యాయన్న అధికారులు.
– కావాల్సిన విత్తనాలను అందుబాటులో ఉంచుకున్నామన్న అధికారులు.
– ఎరువులు కూడా అందుబాటులో ఉంచుకుంటున్నామన్న అధికారులు.
ఇప్పటికే 6 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లా స్దాయి నుంచి ఆర్బీకే స్ధాయి వరకు సిద్దం చేసుకున్నామన్న అధికారులు
– సాగునీటికి ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా సకాలంలో నీళ్లు విడుదల చేసే అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
– సాగునీటికి ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు లేవన్న అధికారులు.
– అందరితో మాట్లాడి సాగునీటి విడుదలపై కార్యాచరణ సిద్ధంచేసుకోవాలన్న సీఎం.
– ఆర్బీకేల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ వ్యవసాయ సలహామండళ్లతో సమావేశాలు నిర్వహించి షెడ్యూలు రూపొందించుకోవాలన్న సీఎం.
*కౌలు రైతులకు అండగా....:*
– సీసీఆర్సీపైన అందరికీ అవగాహన కల్పించాలన్న సీఎం
– కౌలు రైతులకు దీనివల్ల మేలు జరుగుతుందన్న సీఎం
– సీసీఆర్సీ పెంచడంవల్ల కౌలు రైతులకు అన్నిరకాలుగా ప్రభుత్వ సహాయం అందుతుంది: సీఎం
–వీలైతే ప్రతి ఇంటికీ వెళ్లి సీసీఆర్సీపై అవగాహన కల్పించాలన్న సీఎం
– సీసీఆర్సీ వల్ల రైతు హక్కుకు ఎలాంటి భంగం కలగదని, దీనిపై పూర్తిస్థాయి సమాచారాన్ని వారికి వివరించాలన్న సీఎం.
– అన్ని వివరాలతో ముఖ్యమంత్రిగా నా తరఫు నుంచి ఒక లేఖ పంపించండి:
– యూనివర్శిటీల ద్వారా ఆరునెలల ఇంటర్న్‌షిప్ ఆర్బీకేల్లో ఉండేలా కోర్సులను రూపొందించాలని ఇదివరకే చెప్పాం:
– వారిచ్చే పరిశీలన, సలహాల కారణంగా మరింత మెరుగుపడుతుంది:
– ఆర్బీకేల కార్యకలాపాలపై నిరంతరం పరిశోధన కూడా ఉంటుంది:
*శ్రీకాకుళం పైలట్ ప్రాజెక్టు విజయవంతం:*
– శ్రీకాకుళం వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చే పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయ్యింది:
– దాదాపు 30శాతం విద్యుత్ ఆదా అయ్యింది, కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అయ్యింది.
– రైతులు వాడని కరెంటును ఉచిత విద్యుత్ పేరుమీద ఇప్పటివరకూ లెక్క కడుతున్నారు:
– మీటర్ల కారణంగా వీటన్నింటికీ చెక్‌పడే పరిస్థితి వచ్చింది, పారదర్శక వ్యవస్థ ఏర్పడింది:
– రైతులకు నాణ్యమైన కరెంటు అందుతోంది, సిబ్బందిలో కూడా జవాబుదారీతనం పెరిగింది:
– త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కూడా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమరుస్తారు:
– దీనివల్ల అన్నిజిల్లాలో నాణ్యమైన కరెంట్ రావడమే కాక, రైతులకు సేవలు మెరుగవుతాయి:
– రాజకీయంగా లబ్ధికోసం మీటర్ల వ్యవహారంపై దుష్ప్రచారం చేస్తున్నారు:
– దీన్ని తిప్పికొట్టి, రైతులకు జరుగుతున్న మేలును వివరించాలి:
– రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పించాలి:
– రైతు భరోసా కేంద్రాల్లో ప్రకృతి, సహజ వ్యవసాయ పద్ధతులకు పెద్దపీట వేయాలి. ప్రతి ఆర్బీకేలో దీనికోసం సీహెచ్‌సీ ఉండాలి:
– ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కచ్చితంగా రైతులకు అందాలి:
– ఆర్బీకేల ద్వారా ఈ సరఫరా మరింత మెరుగుపడాలి:
– అన్ని ఆర్బీకేల్లో వీటికోసం స్టోరేజీ రూమ్స్‌ను నిర్మించేలా చర్యలు తీసుకోవాలి:
*రైతులకు సబ్సిడీపై పరికరాలు:*
– రైతులకు ఇండివిడ్యువల్‌గా సబ్సిడీపై వ్యవసాయ పరికరాలపై సీఎం సమీక్ష.
– ఆర్బీకేల పరిధిలో ఉన్న యంత్రాలు కాకుండా, రైతులకు సొంతంగా ఎలాంటి వ్యవసాయ పరికరాలు కావాలన్నదానిపై డిమాండ్ సర్వే నిర్వహించామన్న అధికారులు.
– వీటి ఆధారంగా ఆయా వ్యవసాయ ఉపకరణాలను గుర్తించామన్న అధికారులు.
– చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇచ్చి వారికి సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించాలన్న సీఎం.
– దీనిపై ప్రణాళిక తయారు చేయాలన్న సీఎం.
– ప్రతి ఆర్బీకే పరిధిలో సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందేలా చూడాలన్న సీఎం.
*కిసాన్ డ్రోన్లపైనా సీఎం సమీక్ష.*
– కిసాన్ డ్రోన్లు, నిర్వహణ, వినియోగంపై కేంద్ర ప్రభుత్వ ఇటీవల రూపొందించిన మార్గదర్శకాలను వివరించిన అధికారులు.
– ప్రతి ఆర్బీకేల పరిధిలో చదువుకుని పరిజ్ఞానం ఉన్న రైతులతో ప్రత్యేకంగా డ్రోన్ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ఏర్పాటు చేసి.. వారికి శిక్షణ ఇవ్వాలి.
– శిక్షణ అనంతరం వారికి సర్టిఫికెట్‌కూడా ఇవ్వాలి.
– రైతులందరికీ శిక్షణ ఇవ్వడానికి ఒక మాస్టర్ ట్రైనర్‌ను గుర్తించాలి:
– ఒక డ్రోన్‌తో ఏరకంగా ఫెస్టిసైడ్స్ వినియోగించవచ్చు, ఏరకంగా ఫెర్టిలైజర్స్ వేయొచ్చో వివరించేలా రూపొందించిన వీడియోలను రైతుల్లో అవగాహన పెంచడానికి చూపించాలి:
– నానో ఫెర్టిలైజర్స్, నానో ఫెస్టిసైడ్స్ వస్తున్న నేపథ్యంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయి:
– మోతాదుకు మించి రసాయనాల వినియోగం తగ్గుతుంది, దీనివల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది :
– ఈ ఏడాదిలో డ్రోన్ల వినయోగించే పరిస్థితిలోకి వెళ్లాలి:
– డ్రోన్ల నిర్వహణపైన కూడా సరైన వ్యవస్థ ఉండాలి:
*మిల్లెట్ పాలసీ:*
– రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మిల్లెట్‌పాలసీపైనా సీఎం సమీక్ష.
– చిరుధాన్యాలు సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించాలి:
– రైతులు సాగు చేసిన తర్వాత మద్దతు ధర, ప్రాససింగ్ తదితర అంశాలపైనా దృష్టిపెట్టాలి:
–దీనిపైన పూర్తిస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేయాలి:
– ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఉండాలి:
– చిరు ధాన్యాల ఉత్పత్తులకు విలువ జోడించాలి:
– ఆహారంలో భాగంగా వీటి వినియోగం పెరగాలి:
– నీటివసతులు అరకొరగా ఉన్న ప్రాంతాల్లో పంటమార్పిడి ఎలా ఉండాలన్న దానిపై ప్రణాళిక సిద్ధంచేయండి :
– తర్వాత వాటి సాగు, ఉత్పత్తులకు మద్దతు ధర, ప్రాససింగ్, అదనపు విలువ జోడించడం తదితర వ్యవస్థలన్నీ సిద్ధంగా ఉండాలి : అధికారులు సీఎం నిర్దేశం.
ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, పుడ్ ప్రాససింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్‌రెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్ సి హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్ ఎస్ ఎస్ శ్రీధర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment