స్పందనకు 171 వినతులు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి


స్పందనకు 171 వినతులు

 జిల్లా కలెక్టర్ సూర్యకుమారి


విజయనగరం, ఏప్రిల్  02 (ప్రజా అమరావతి):  సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన  కు ప్రజల నుండి 171 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 42, డి.ఆర్.డి.ఏ కు 11 అందగా  రెవిన్యూ కు సంబంధించి 118 వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  ఉప కలెక్టర్లు సూర్యనారాయణ, పద్మావతి స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అధికారుల తో మాట్లాడుతూ ఏ ఒక్క స్పందన దరఖాస్తు కూడా గడువు దాటి ఉండకుండా చూడాలని అన్నారు. 



Comments