రాజమహేంద్రవరము, (ప్రజా అమరావతి);
* మే 18 (బుధవారం) తొలి తూర్పు గోదావరి జిల్లా డీఆర్సి సమావేశం
ఆర్ ఎమ్ సి కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాట్లు
15 అంశాల అజెండా రూపకల్పన
హాజరుకానున్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు
జిల్లా కలెక్టర్ డా.కె. మాధవిలత
ఈ నెల 18 వ తేదీ బుధవారం రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష కమిటీ (డి ఆర్ సి) సమావేశం నిర్వహించబడుతుందని సోమవారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఈ సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి,రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు,సినీ ఆటో గ్రఫీ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని పేర్కొన్నారు.
డిఆర్సి సమావేశానికి జిల్లా మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులు తదితరులు హాజరుకానున్నారు. అధికారులందరూ వారి వారి శాఖాలపరంగా అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పూర్తిస్థాయి నివేదికలతో సమీక్షా సమావేశానికి హాజరుకావాలని ఆదేశించడం జరిగిందన్నారు.
సమావేశంలో హౌసింగ్ సమీక్షలో లో పేదలందరికీ ఇళ్లు, టిడ్కో పైన, వ్యవసాయం పై రైతు భరోసా అమలు, ఖరీఫ్ ప్రణాళిక, కస్టమ్ హైరింగ్ సెంటర్ పైన, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం లో భాగంగా లేబర్ బడ్జెట్ పైన గ్రామ సచివాలయ ఆర్బికే, హెల్త్ క్లినిక్, తదితర భవనాలు నిర్మాణాల పై సమీక్ష చేస్తారు. విద్యా సమీక్షలో రెండో విడత నాడు నేడు పనులు పై, ఆరోగ్యశాఖ సమీక్ష లో నాడు నేడు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు పై, పౌరసరఫరాలు శాఖ సమీక్షలు ధాన్యం సేకరణపై, హార్టికల్చర్, మత్స్య శాఖ లపై సమీక్ష, గ్రామీణ నీటి సరఫరా సంస్థ లో జల జీవన్ మిషన్ పై, తదుపరి జగనన్న భూ హక్కు & భూ రక్షా (రీ సర్వే) పై , ఇరిగేషన్, రోడ్లు మరియు రహదారులు, గ్రామ వార్డు సచివాలయాల సమీక్షా లో పౌర సేవలు, వాలంటీర్ల స్థితి మరియు వివిధ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.
addComments
Post a Comment