జిల్లాలో 272 గ్రామాల్లో రీ సర్వే పనులు చేపడుతున్నట్లు తెలిపారు.



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి) : 


* భూ హక్కు భూ రక్షా కార్యక్రమంలో భాగంగా  రెవెన్యూ సిబ్బంది రీ సర్వే  పూర్తి చేసేందుకు క్షేత్ర స్థాయి లో ప్రణాళిక లు రూపొందించామని జిల్లా కలెక్టర్ డా. కె

 మాధవీలత పేర్కొన్నారు .



గురువారం  అమరావతి నుంచి సిసిఎల్ఏ & స్పెషల్ సీఎస్ జీ. సాయిప్రసాద్, కార్యదర్శి బాబు. ఏ. తదితరులు   రీసర్వే పై వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్,  జేసీ సిహెచ్. శ్రీధర్ లు పాల్గొన్నారు.


సి సి ఎల్ ఏ & ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం  అమలులో జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను సాధించడానికి ఆర్డీవో లు, తహశీల్దార్లు సర్వే శాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.  లక్ష్యాలను సాధించడానికి మరింత చొరవ తీసుకోవలసి ఉందని స్పష్టం చేసినందున, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లు ఈ విషయంలో ప్రత్యెక దృష్టి పెట్టాలన్నారు. 



జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 272 గ్రామాల్లో రీ సర్వే పనులు చేపడుతున్నట్లు తెలిపారు.


తొలిదశలో 81 గ్రామాల్లో తొలి దశ రీ సర్వే పనులు ప్రారంభించగా ఇప్పటివరకు  63 గ్రామాల్లో రీ సర్వే పూర్తయిందన్నారు. ఈ వారం 23  గ్రామాల్లో  రీ సర్వే పనులు పూర్తి  చెయ్యాల్సి ఉండగా  గ్రామాల్లో 22 గ్రామాలలో పూర్తి చెయ్యడం జరిగిందని, మరో గ్రామంలో ప్రగతిలో ఉందన్నారు.  ఆర్డీవో లు క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశామన్నారు.  ఆర్డీవో లకు రీసర్వే ను వేగవంతం చేసేందుకు  తహశీల్దార్లుకి లక్ష్యాలను నిర్దేశించాలని ఆదేశించామన్నారు. జిల్లాలలో వాస్తవిక దృష్టితో 7037 ఎకరాల్లో సర్వే కోసం ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. సర్వే చేసిన భూముల్లో సర్వే రాళ్ళు ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందుకు అనుగుణంగా ప్రతిపాదన లు సమర్పించా మన్నారు.



Comments