ఈ నెల 4 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన

 *ఈ నెల 4 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన


*

అమరావతి (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 4వ తేదీ నుంచి జిల్లాల పర్యటనలు చేయనున్నారు. టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసనల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. మే 4న శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో చంద్రబాబు పర్యటించనున్నారు. 5న భీమిలి నియోజవర్గం తాళ్లవలస గ్రామం, 6న ముమ్మడివరం నియోజవర్గం, కోరింగ గ్రామంలో జరిగే బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రభుత్వ పన్ను పోటు, బాదుడుపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న టీడీపీ నేతలు మహానాడు వరకు వివిధ జిల్లాలలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేశారు.