నెల్లూరు మే 13 (ప్రజా అమరావతి);
రాబోవు 40 రోజులు నాడు నేడు పనులు త్వరితగతిన చేసుకొనుటకు మంచి అవకాశమ
ని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు తెలిపారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మనబడి నాడు నేడు రెండవ దశ పనులను జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నాడు నేడు రెండవ దశలో 889 పాఠశాలలు ఎంపికయ్యాయన్నారు. ఇప్పటికీ ఎస్టిమేట్లు వేయని పనులకు రాబోవు రెండు రోజుల లోపు ఎస్టిమేట్లు పూర్తి చేయాలన్నారు సంబంధిత బ్యాంకు అకౌంట్లను వెంటనే ఓపెన్ చేయుటకు చర్యలు తీసుకోవాల్సిందిగా మండల విద్యాశాఖా ధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ జరుగుతున్న పనులను సమీక్షించాలన్నారు. పనులు జరుగుతున్న ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉండాలన్నారు.
ఈ సమావేశంలో సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి ఉషారాణి, విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment