విజయవాడ (ప్రజా అమరావతి);
55 సంవత్సరాలు దాటిన పభుత్వ ఉద్యోగులు కూడా ఏపిజిఎల్ఐ పాలసీలు పొందుటకు ప్రతిపాదనలు సమర్పించుటకు గడువు తేదీ 30-06-2022..
55 సంవత్సరాలు దాటిన పభుత్వ ఉద్యోగులు కూడా ఏపిజిఎల్ఐ పాలసీలు పొందుటకు ప్రతిపాదనలు సమర్పించుటకు గడువు తేదీ 30-06-2022 గా నిర్ణయించినట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జిల్లా భీమా కార్యాలయం విజయవాడ సంయుక్త సంచాలకులు శ్రీ ఎస్ లింగమూర్తి ఒకప్రకటనలో తెలిపారు. సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ 55 సంవత్సరములు వయస్సు దాటిన పిదప కట్టిన ఏపిజిఎల్ఐ ప్రీమియం నకు పాలసీలు రాని ఉద్యోగులందరూ ఏపిజిఎల్ఐ కార్యాలయానికి ప్రతిపాదనలు సమర్పించి అట్టి ప్రీమియం నకు పాలసీ పొందుటకు గాను ప్రభుత్వం వారు గడువు తేదీని 30-06-2022 వ తేదీ వరకూ ఇచ్చి యున్నారని తెలిపారు.
కావున సర్వీసులో ఉన్న 55 సంవత్సరాలు వయస్సు దాటి ఇంకను ప్రభుత్వ సర్వీసులో ఉండి పాలసీలు పొందని ఉద్యోగులు వెంటనే పాలసీ రాని ప్రీమియం కు సరిపోను ప్రతిపాదనలను జిల్లా భీమా కార్యాలయమునకు 30-06-2022 లోపు సమర్పించి తగిన రసీదు ను పొందుటకు అవకాశమును కల్పించి ఉన్నందున సదరు అవకాశమును సద్వినియోగం చేసుకొనవలసిందిగా సంయుక్త సంచాలకులు ఎస్. లింగమూర్తి ఆ ప్రకటనలో కోరారు.
addComments
Post a Comment