జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద 69 గ్రామాల్లో చెత్త సేకరణ చేపడుతున్నాం

 జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద 69 గ్రామాల్లో చెత్త సేకరణ చేపడుతున్నాం*


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్.*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 26 (ప్రజా అమరావతి):


జిల్లాలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద 69 గ్రామాల్లో చెత్త సేకరణ చేపడుతున్నామని పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేదికి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ వివరించారు. గురువారం తాడేపల్లి పిఆర్ & ఆర్ డి కమిషనర్ కార్యాలయం నుంచి జగనన్న స్వచ్ఛ సంకల్పం, ఎంజిఎన్ఆర్ఇజిఎస్, తదితర అంశాలపై పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్ & ఆర్ డి కమిషనర్ కోన శశిధర్ లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కింద జిల్లాలో అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమం కింద తడి, పొడి చెత్త నిత్యం సేకరిస్తున్నామని, అందులో 69 గ్రామాల్లో తడి చెత్త 7,316 కిలోలు సేకరించగా, దాని అమ్మకం ద్వారా 65,556 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అలాగే  పొడి చెత్త 6,124 కిలోలు సేకరించగా, దాని అమ్మకం ద్వారా 32,083 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. జిల్లాలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆరు రోజులకు గాను 5,93,538 మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించామని, రోజు 99 వేల మందికి పైగా కూలీలకు ఉపాధి పనులు కల్పించామన్నారు. గురువారం రోజు జిల్లాలో అత్యధికంగా 1,19,811 లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించామని, వివరాలను ఆన్లైన్ లో అప్డేట్ ఎప్పటికప్పుడు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఉపాధిహామీ కింద ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను వేగవంతంగా చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డ్వామా పిడి విజయ్ ప్రసాద్, డిపిఓ విజయ్ కుమార్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ,  పి రషీద్ ఖాన్,పంచాయతీరాజ్ ఎస్ఈ  గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Comments