రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
గురువారం జిల్లాలో రెండవ ఏడాది ఇంటర్, ఒకేషనల్ పరిక్షలకి 94.22 శాతం మంది విద్యార్థులు హాజరు .. కలెక్టర్ కె. మాధవీలత
ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం
కెమిస్ట్రీ పేపర్- II ; కామర్స్ పేపర్-II ; సోషియాలజీ పేపర్-II ; ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-II పరీక్షలకు ఇంటర్ విద్యార్ధులు 14,704 మంది , ఓకేషనల్ విద్యార్థులు 679 మంది పరీక్షలకు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత గురువారం ఒకప్రకటనలో తెలియచేశారు.
కలెక్టర్ మాధవీలత వివరాలు తెలుపుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 49 పరీక్షా కేంద్రాల లో ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షా కోసం ఈరోజు 15,400 మందికి గాను 14,704 మంది , ఒకేషనల్ కోర్సు రెండవ ఏడాది పరీక్షలకు 926 కి గాను 679 మంది హాజరయ్యారని తెలిపారు.
రాజమండ్రి డివిజన్ పరిధిలో 32 కేంద్రాలలో ఇంటర్ కి 11,056 మందికి గాను 10,472 మంది హాజరు కాగా 584 మంది హాజరు కాలేదన్నారు. ఒకేషనల్ కోర్సు కి సంబందించిన 595 మందికి గాను 393 మంది హాజరు కాగా 202 మంది హాజరు కాలేదని తెలిపారు.
కొవ్వూరు డివిజన్ పరిధిలో 17 కేంద్రాలలో ఈరోజు ఇంటర్ పరీక్షలకి 4,344 మందికి గాను 4,232 మంది హాజరు కాగా 112 మంది హాజరు కాలేదని తెలిపారు. ఓకేషనల్ కోర్స్ కి సంబంధించి
331 మందికి గాను 286 మంది హాజరు కాగా 45 మంది హాజరు కాలేదని తెలిపారు.
addComments
Post a Comment