తిరుపతి , మే 01 (ప్రజా అమరావతి):
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 5న తిరుపతిలో పలు కార్యక్రమాలలో పాల్గొంటున్న సందర్భంగా టీటీడీ ఈవో జవహర్ రెడ్డి , అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి , జెసి బాలాజీ, నగరపాలక కమిషనర్ అనుపమ అంజలి , జెఇఓ వీరబ్రహ్మం , ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, సి వి అండ్ ఎస్ ఓ నరసింహ కిషోర్ , అధికారులు ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలను పరిశీలించారు.
అలిపిరి వద్ద ముఖ్యమంత్రి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన
చేయనున్న ప్రదేశాన్ని పరిశీలించారు. శంకుస్థాపన తో పాటు బర్డ్ ఆసుపత్రి లో నూతనంగా ఏర్పాటుచేసిన రెండు వార్డులను ఇక్కడ నుండే వర్చువల్ విధానంలో ప్రారంభించే గ్రహణం మొర్రి, వినికిడి సంబంధించిన చిన్న పిల్లల వార్డులను పరిశీలించారు.
టీటీడీ ఈవో , జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు . అనంతరం టిటిడి పరిపాలనా భవనం లో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి టాటా కాన్సర్ ఆసుపత్రి ప్రారంబోత్సవం , విద్యాకానుక బహిరంగ సభ ఏర్పాటు , పోలీస్ భద్రత వంటి అంశాలు పై సమీక్ష నిర్వహించారు .
వీరి పర్యటనలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు , తిరుపతి ఆర్ డి ఓ కనక నర్సారెడ్డి , మెప్మా పిడి రాధమ్మ , జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి సీతారామరెడ్డి పోలీసు, రెవెన్యూ, టీటీడీ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు
addComments
Post a Comment