ఏపీలో కేన్సర్‌ చికిత్స కోసం అందుబాటులో ఉన్న సౌకర్యాలు

 

అమరావతి (ప్రజా అమరావతి);



*తిరుపతిలో రేపు (05_05_2022) శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్డు రీసెర్చ్ను ప్రారంభించనున్న సీఎం శ్రీ వైయస్. జగన్.*


*ఆంధ్రప్రదశ్‌లో కేన్సర్‌ వ్యాధి పై నివేదిక.*


*ప్రతి లక్షమందిలో 95–120 మందిలో కేన్సర్‌ వ్యాధి బయటపడుతున్నటు అంచనా.*


ఏపీలో కొత్తగా నమోదైన కేన్సర్‌ కేసులు 53,000

*ప్రస్తుతం కేన్సర్‌ వ్యాధిబాధితులు దాదాపు 70 వేలు.

2020లో కేన్సర్‌ మరణాలు 34,000

2020 నుంచి 2030 వరకు కేన్సర్‌ కేసులు పెరుగుగల అంచనా 28శాతం


*ఏపీలో కేన్సర్‌ చికిత్స కోసం అందుబాటులో ఉన్న సౌకర్యాలు*

అసమతుల్యంగా ఉన్న కేన్సర్‌ ఆస్పత్రులు 

ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాల్లో ఉన్న 24 పెద్ద ప్రైవేటు ఆసుపత్రులకు గానూ...  6 ప్రధాన నగరాల్లోనే ఉన్న కేన్సర్‌ ఆసుపత్రుల సంఖ్య 18.

రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకు కానీ, కేవలం 12 జిల్లాలకు మాత్రం కేన్సర్‌ ఆసుపత్రిల సౌకర్యం అందుబాటులో ఉంది.

9 మెడికల్‌ కాలేజీలలో మంజూరైన కేన్సర్‌ (రేడియో థెరపీ) చికిత్స యూనిట్లు.


11 మెడికల్‌ కాలేజీలుండగా... ఒకే ఒక్క మెడికల్‌ కాలేజీ(గుంటూరు)లో మాత్రమే కేన్సర్‌ చికిత్స కోసం అందుబాటులో ఉన్న ఎల్‌ఐఎన్‌ఏసీ(లినాక్‌ మెషీన్‌).


మరో 3 మెడికల్‌ కాలేజీల్లో పాత కోబాల్ట్‌ మెషీన్‌ సహాయంతో అందుతున్న కేన్సర్‌ చికిత్స అందిస్తుండగా... మిగిలిన కాలేజీల్లో కేవలం డే – కేర్‌ కీమోథెరపీ మాత్రమే అందుబాటులో ఉంది.


కేవలం అసమతుల్యంగా ఏర్పాటైన ప్రయివేటు కేన్సర్‌ ఆసుపత్రుల కారణంగా... 40 నుంచి 100 శాతం వరకు 21 జిల్లాలకు చెందిన కేన్సర్‌ రోగులు చికిత్స కోసం తప్పనిసరి పరిస్థితుల్లో తమ జిల్లాలను దాటి బయట ప్రాంతాలకు చికిత్స కోసం వెళ్లాల్సిన స్ధితి. 


ప్రస్తుతం గుంటూరు, కర్నూలు జనరల్‌ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్న పెయిన్‌ అండ్‌ పల్లియాటివ్‌ సర్వీసెస్‌(ఉపశమన సేవలు).


రాష్ట్రంలో అందుబాటులో లేని హాస్పైస్‌ సేవలు.


*కేన్సర్ చికిత్స - ఆరోగ్యశ్రీ సేవలు...*

కేవలం కేన్సర్‌ చికిత్స కోసమే ప్రతిఏటా రూ.400 కోట్లు ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చుపెడుతున్న ప్రభుత్వం.

ప్రైవేటు ఆసుపత్రుల్లో 87 శాతం ఆరోగ్యశ్రీ సొమ్మును కేన్సర్‌ చికిత్స కోసం ఖర్చు చేస్తుండగా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 13 శాతం ఆరోగ్యశ్రీ మొత్తాన్ని కేన్సర్‌ చికిత్స కోసం ఖర్చు చేస్తున్న పరిస్థితి.


ప్రస్తుత పరిస్థితుల్లో సమగ్ర కేన్సర్‌ కేర్‌ సర్వీసులు ఆవశ్యకతను గుర్తించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌. 


కేన్సర్‌ నివారణ నుంచి చికిత్స వరకు సమగ్రమై అత్యాధునిక చికిత్స అందుబాటులోకి  తీసుకురావాలని నిర్ణయం.


నివారణ, చికిత్స అనంతరం ఉపశమన సేవలను గ్రామ సచివాలయం నుంచి వివిధ దశల వరకు అందుబాటులోకి తేవాలన్న సీఎం. 


కేన్సర్‌ చికిత్సా విధానాలతో వైద్య కాలేజీలను బలోపేతం చేయడం,  కొత్త కేన్సర్‌ కేర్‌ సెంటర్లను  ప్రభుత్వ  ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయడంతో పాటు అందుకు అవసరమైన మానవ వనరులును కూడా ఏర్పాటు చేయడం లక్ష్యం.


*ఇందులో భాగంగా...*

2030 నాటికి... ప్రతి పౌరుడికి కేన్సర్‌ వ్యాధికి సంబంధించిన కనీస చికిత్సను వారి ఆవాసానికి 50 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులోకి తేవడమే లక్ష్యం.

తద్వారా కేన్సర్‌ నివారణ, బేసిక్‌ రేడియోషన్‌ మరియూ కీమోథెరపీ, ఉపశమన సేవలు ఏర్పాటుకు చర్యలు.


2030 నాటికి ఏ పౌరుడుకీ  ఏ రకమైన కేన్సర్‌ అడ్వాన్స్‌డ్‌ చికిత్స అవసరం రాకుండా చేయడం లక్ష్యం.

దేశంలోనే తొలిసారి మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా చికిత్స అందించడమే లక్ష్యంగా నిర్దేశించిన ప్రభుత్వం.

5 దశలలో సమగ్ర కేన్సర్‌ చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తేవడమే లక్ష్యం.


*నివారణా చర్యలు..*

వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌కి వచ్చే వరకూ 60 నుంచి 70 శాతం కేన్సర్‌ కేసులను గుర్తించలేకపోవడం వల్ల దీని నుంచి కోలుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయి.


మూటిండ ఒక వంతు కేన్సర్‌ కేసులు( రొమ్ము కేన్సర్‌ –13.5శాతం, గర్భాశయ కేన్సర్‌ – 9.4 శాతం, ఓరల్‌ కేవిటీ కేన్సర్‌ –10.3 శాతం) ప్రాధమిక దశలోనే గుర్తించి చికిత్స అందించే అవకాశం ఉంది. 


స్కీనింగ్‌ పరీక్షలు పెంచడం ద్వారా... ప్రాధమిక దశలోనే కేన్సర్‌ కేసులను గుర్తించడంతో పాటు, మెరుగైన చికిత్స అందించడం ద్వారా వ్యాధి బారినుంచి పూర్తిగా గట్టెక్కే అవకాశాలున్నాయి. 


గ్రామీణ జనాభా లక్ష్యంగా... గ్రామ సచివాలయం వారీగా మామూ బస్సెస్‌ సహకారంతో రోజుకు ఒక సచివాలయంలో  స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించవచ్చు. 


44 మామూ బస్సుల సాయంతో 11,162 గ్రామ సచివాలయాల్లో 254 రోజుల్లో  స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహణకు సన్నద్ధం. 


స్క్రీనింగ్‌ పరీక్షలు ద్వారా 1.3 కోట్ల మంది మహిళలకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు.


15 ఏళ్ల కంటే అధిక వయస్సున్న 3.9 కోట్ల మంది ఓరల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు ద్వారా చేకూరనున్న లబ్ధి.


ప్రారంభదశలో బ్రెస్ట్‌ కేన్సర్‌ ను గుర్తించడంలో ఉపయక్తంగా మామోగ్రామ్‌ .

1 లక్ష మంది పట్టణ ప్రాంత జనాభాకు 1 మామో గ్రామ్‌ యూనిట్‌ అందుబాటులోకి రానుండగా.. మొత్తం 43 యూనిట్స్‌ ఏర్పాటు.


గిరిజన ప్రాంతాల్లో ప్రతి రెండు మండలాలకు 1 మామ్మో గ్రామ్‌ చొప్పున 18 మామోగ్రామ్‌ యూనిట్స్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు.


గ్లోబల్‌ స్క్రీనింగ్‌ కార్యక్రమంలో భాగంగా వివిధ పరీక్షల కోసం ఆసుపత్రులకు వస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించే దిశగా వైద్యులకు తగిన శిక్షణ అందించనున్న ప్రభుత్వం.


దీనిద్వారా రొమ్ము, నోరు, గర్భాశయ కేన్సర్‌ వ్యాధి లక్షణాలను తొలిదశలోనే గుర్తించడం ప్రభుత్వ లక్ష్యం.


*కేన్సర్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటు*

మొత్తం 43 కేన్సర్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటుతో పాటు తిరుపతి శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో అంతర్జాతీయ కేన్సర్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు.


విజయవాడ , విశాఖపట్నం మున్సిపల్‌ కార్పోరేషన్ల పరిధిలో 2 కాంప్రహెన్షివ్‌ కేన్సర్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటుతో పాటు 8 పాత మెడికల్‌ కాలేజీ సెంటర్లు, 16 కొత్త మెడికల్‌ కాలేజీ సెంటర్లుతో పాటు జిల్లా, ఏరియా ఆసుపత్రుల పరిధిలో 2028 మార్చి నాటికి  17 కేన్సర్‌ ట్రీట్మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం లక్ష్యం. 


*మొత్తం 49 లినాక్స్‌ ఏర్పాటు చేయనుండగా...* ప్రస్తుతం (ఫేజ్‌ జీరో) 6 లినాక్స్, ఫేజ్‌ వన్‌లో 7, ఫేజ్‌ టూలో 15, ఫేజ్‌ త్రీలో 21 లినాక్‌ మెషిన్లు ఏర్పాటు.

ఇవి అందుబాటులోకి రావడం ద్వారా... ఫేజ్‌ జీరోలో 7500 మంది, ఫేజ్‌ 1లో 13400, ఫేజ్‌ 2లో 21200 , ఫేజ్‌ 3లో 24400 మందికి రోగులకు అదనపు సౌకర్యాలు కలగనున్నాయి.


వైద్య కళాశాలల్లో కేన్సర్‌ కేర్‌ సేవలను బలోపేతం చేయడం ద్వారా మరిన్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లు వచ్చేలా చేసి, రాష్ట్రంలో ఆ మేరకు సమగ్రమైన కేన్సర్‌ వైద్య సేవలు అందేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యం. 


విశాఖపట్నం, గుంటూరు జిల్లా చిన కాకాని(సిద్దార్ధ మెడికల్‌ కాలేజీ)లలో కాంప్రహెన్షివ్‌ కేన్సర్‌ సెంటర్‌ (సీసీసీ) ఏర్పాటు చేయడం ద్వారా కేన్సర్‌ వ్యాధికి అత్యాధునిక చికిత్స అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యం. 

తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటర్నేషనల్‌ కేన్సర్‌ కేర్‌ సెంటర్‌(ఐసీసీ) ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.

దీని ద్వారా పీడియాట్రిక్‌ కేన్సర్‌ కేర్‌ సేవలతో పాటు, జీనోమిక్‌ రీసెర్చ్‌ సర్వీసులు, బోన్‌ మేరో ట్రాన్స్‌ప్లాంట్‌ సర్వీసులు అందించడమే లక్ష్యం.


కాంప్రహెన్షివ్‌ కేన్సర్‌ కేర్‌ సెంటర్లు(సీసీసీ), ఇంటర్నేషనల్‌ కేన్సర్‌ కేర్‌ సెంటర్లు(ఐసీసీ) ల ద్వారా 420 రకాల కేన్సర్‌ కేర్‌ ప్రొసిడ్యూర్స్‌ ఆరోగ్యశ్రీ ద్వారా అందించడమే లక్ష్యం. 


దశల వారీగా సీసీసీల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించిన ప్రభుత్వం... 2022 నుంచి 2028 లోపు వీటిని నిర్మించాలని నిర్ణయం. 


బొంగరాలబీడు, గుంటూరు ఆసుపత్రిలో సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పల్లియేటివ్‌ కేర్‌ అండ్‌ హాస్పైస్‌ ను సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ సహకారంతో ఏర్పాటుకు ప్రతిపాదన.


వైయస్సార్‌ జిల్లా ఐఎంహెచ్‌ఎస్, విశాఖపట్నంలలో సైకోఆంకాలజీ కోర్సులను , ఆంకో ఫార్మా కోర్సులను ఆంధ్రా, నాగార్జున యూనివర్సిటీల సహకారంతో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.