తిరుపతి (ప్రజా అమరావతి);
*శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అండ్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైఎస్ జగన్ ఏమన్నారంటే...*
టాటా గ్రూప్ ఇక్కడ అత్యాధునిక ఆసుపత్రిని ఏర్పాటుచేయడం మనకు గర్వంగా మరియు ఆనందంగా ఉంది.
టీటీడీతో, రాష్ట్రప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు పొందవచ్చు, ఇది విన్ విన్ సిచ్యుయేషన్‌గా ఉంటుంది. ఈ ఆసుపత్రి తిరుపతి పట్టణానికి మణిపూస లాంటిది. దీనికి సంబంధించి టీటీడీ కృషి కూడా చాలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్య సేవలను విస్తృతంగా చేయాలని టీటీడీని కోరింది. దీనికి టీటీడీ కూడా అనేక విధాలుగా సాయం చేస్తూ టెరిషియరీ కేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టాటా గ్రూప్‌ను కూడా ఈ మంచి కార్యక్రమంలో, వైద్య రంగంలో మరింతగా భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. అంకాలజీ విభాగంలో నోరి దత్తాత్రేయుడు గారు ప్రముఖ భూమిక పోషిస్తున్నారు. దత్తాత్రేయ గారితో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు.
addComments
Post a Comment