జిల్లాలో నాడు నేడు కింద ప్రతి సచివాలయం పరిధిలో ఒక పని ప్రారంభించాలి

 


రాజమహేంద్రవరం  (ప్రజా అమరావతి):  


* జిల్లాలో నాడు నేడు కింద ప్రతి సచివాలయం పరిధిలో ఒక పని ప్రారంభించాలి



* 442 స్కూళ్ల ల్లో 811 తరగతి గదులు నిర్మాణం 


* రెండు రోజుల్లో పనులు ప్రారంభించాలి..


* మండల స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు 


* పాఠశాలల్లో నాడు నేడు  పై సమీక్ష లో కలెక్టర్ ఆదేశం


రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న  మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా  రాబోయే పది రోజులల్లో ప్రతి సచివాలయం పరిధిలో ఒక పని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. 


గురువారం విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి

బి. రాజశేఖర్ నిర్వహించిన విసి కి స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కలెక్టర్ డా మాధవీలత , జిల్లాలో మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని అంకిత భావంతో చేపట్టాల్సి ఉందన్నారు. విద్యా రంగంలో సంస్కరణల్లో భాగంగా నాడు నేడు పనులు చేపట్టి స్కూల్ ల్లో రూపురేఖలు మార్పు చెయ్యడం జరుగుతోందని, ఇది జీవిత కాలంలో వచ్చే ఒక మంచి సదవకాశం అన్నారు. జిల్లాలో 442 స్కూళ్ల ల్లో 811 తరగతి గదులు నిర్మాణం కోసం రూ.168 కోట్లతో పనులు చేపట్టడం జరుగుతోందన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఆయా పాఠశాలల్లో చేపట్టే నిర్దుష్టమైన పనులను పేరెంట్స్ కమిటీ, ప్రధానోపధ్యాయులు, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకోవాలని మాధవీలత ఆదేశించారు. ఆయా పాఠాశాలల్లో చేపట్టే పనులను పేరెంట్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత పనులు చేపట్టాల్సి ఉందన్నారు.  ప్రభుత్వం 11 అంశాల తో కూడి  పాఠశాలల్లో పనులు చేపట్టి స్కూల్స్ రూపురేఖలు మార్పు చెయ్యడం జరగాలన్నారు. ముఖ్యంగా బాలికా విద్య కు ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా స్కూళ్ల ల్లో నీటి వసతి, ప్రత్యేక టాయలెట్ సౌకర్యం కల్పించాలని సూచించారు. 


నాడు నేడు పనులకు అవసరమైన మెటీరియల్ పర్యవేక్షణ కోసం మండల విద్యా అధికారి నోడల్ అధికారిగా నియమించి, పనులు జరిగే స్కూల్స్ కి ఇసుక, సిమెంట్ ఐరన్ తదితర మెటీరియల్ సక్రమంగా సరఫరా చేయడానికి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయ్యాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పన కి తీసుకునే చర్యలు  పకడ్బందీగా అమలు చేయడం ముఖ్యం అన్నారు.


జిల్లా విద్యా శాఖాధికారి ఎస్. అబ్రహం , పంచాయతీ రాజ్ ఎస్ ఈ ఏ బి వి ప్రసాద్, ఈ ఈ (పి హెచ్)  వై. నరసింహరావు, ఎస్ ఈ (ఆర్ డబ్ల్యు ఎస్) బాల శంకర్,  తదితరులు పాల్గొన్నారు. 





Comments