*ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు*
*టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు*
*కుప్పంలో చంద్రబాబు రోడ్ షో*
చిత్తూరు (ప్రజా అమరావతి): జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. గురువారం కుప్పంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని దీనిని అభివృద్ధి చేస్తామన్నారు. టీడీపీ హయాంలో విద్యార్థులు చదువుకోవడానికి కళాశాలలు తీసుకొచ్చామన్నారు. వైసీపీ పాలనలో చదువుకున్న విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకుముందు జీతాలు పెంచాలంటూ కుప్పం షాహి గార్మెంట్స్ మహిళా కార్మికులు చంద్రబాబును కలవడానికి కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహం వద్దకు వచ్చారు. మూడేళ్లుగా తమకు జీతాలు రూ. 8,500 మాత్రమే ఇస్తున్నారని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచమని యాజమాన్యాన్ని అడిగితే పెంచేది లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద మహిళా కార్మికులను పోలీసులు ఓదార్చే ప్రయత్నం చేశారు. తమకు జీతాలు పెంచేంతవరకు విధులకు హాజరయ్యేది లేదని మహిళా కార్మికులు తేల్చి చెప్పారు.
addComments
Post a Comment