కూలీలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం సహించం

 ఉపాధి కూలీల సంఖ్య మరింత పెరగాలి*


*: కూలీలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం సహించం


*


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 27 (ప్రజా అమరావతి):


ఉపాధి హామీ పథకం కింద కూలీల సంఖ్య మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని విసి హాల్ నుంచి ఉపాధి హామీ పథకం అమలు, జగనన్న స్వచ్ఛ సంకల్పం, వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం, ఆర్డబ్ల్యూఎస్ తదితర అంశాలపై ఎంపీడీవోలు, తహసీల్దార్ లు, ఏపీవో లు, మండల స్థాయి అధికారులు, తదితరులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. కూలీలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం సహించమన్నారు. రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో లేబర్ రిపోర్టు ప్రతిరోజు 1.76 లక్షల ఉందని, శ్రీకాకుళం జిల్లాలో ప్రతి రోజూ 1.85 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు వస్తున్నారని, కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో రోజు 1.24 లక్షల మంది కూలీలు పనులకు వస్తున్నారన్నారు. ఇతర జిల్లాలలో మన జిల్లా కన్నా రెండింతలు ఎక్కువగా లేబర్ రిపోర్టు ప్రతిరోజు నమోదవుతోందని, ఎక్కువ మంది కూలీలు పనులకు వస్తున్నారన్నారు. అలాగే వేజ్ రేటు చూసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 226.68 రూపాయల వేజ్ రేటు యావరేజ్ గా ఉందని, అన్నమయ్య జిల్లాలో 222 రూపాయలు వేజ్ రేటు నమోదవుతోందన్నారు. అయితే మన జిల్లాలో 200 రూపాయల కన్నా తక్కువగా వేజ్ రేటు నమోదవుతోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ 240 రూపాయల కన్నా తక్కువగా వేజ్ రేటు నమోదు కావటానికి వీలు లేదని, తక్కువ వేజ్ రేటు నమోదు అయితే డబ్బులు చెల్లించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. వేజ్ రేటు నమోదును మరింత పెంచాలని, ఇందుకోసం క్షేత్రస్థాయి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వేజ్ రేటును 257 రూపాయలు, ఏవైనా ట్రాన్స్పోర్ట్ అలవెన్సులు కూడా కలుపుకుంటే పూర్తిస్థాయిలో వేజ్ రేటు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో నమోదవుతున్న లేబర్ రిపోర్టు, వేజ్ రేటు మన జిల్లాలో నమోదు కాకపోవడం తగదని, తక్కువ లేబర్ రిపోర్టు, తక్కువ వేజ్ రేటు నమోదులో ఎలాంటి వెనుకబాటుతనం సహించేది లేదన్నారు. తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నానని, డ్వామా పిడి, ఎంపీడీవోలు, ఏపీడీలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని, అయితే ఉపాధి పనుల కల్పన, వెజ్ రేట్ నమోదులో సరైన ఫలితాలు రాకపోవడంతో ఎక్కడ లోపం ఉందో గుర్తించాలని, ఏ స్థాయి అధికారి వారి స్థాయిలో సమీక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి పనులకు రావాలని కూలీలకు అవగాహన కల్పించడంలో క్షేత్రస్థాయిలో ఎక్కడైనా వెనుకబడి ఉన్నాము అనేది పరిశీలించుకోవాలన్నారు. పలు కారణాలవల్ల పనులకు రాలేకపోతున్నామని కూలీలు చెబుతున్నారని, ఉపాధి పనుల ప్రాముఖ్యత గురించి దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి కూలీలకు సరైన రీతిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. .


జిల్లాలో గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రౌండింగ్ కానీ భవనాలను వెంటనే గ్రౌండింగ్ చేయాలని, నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కింద జిల్లాలో అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమం కింద తడి, పొడి చెత్తను నిత్యం సేకరించాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ కింద ఇంటింటికి నీటి కుళాయిల ఏర్పాటులో వేగం పెంచాలన్నారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, డ్వామా పిడి విజయ్ ప్రసాద్, డిపిఓ విజయ్ కుమార్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, పంచాయతీ రాజ్ ఎస్ఈ,  తహసిల్దార్ అనుపమ, తదితరులు పాల్గొన్నారు.



Comments