- భూహక్కు-భూరక్ష కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి
- తొందరగా సర్వే పూర్తి చేసేందుకు అదనంగా డ్రోన్ లను వినియోగం
- అర్బన్ ప్రాంతాల్లో సర్వేకు ఎదురయ్యే ప్రతిబంధకాలను గుర్తించాలి
- గ్రామకంఠంలో యాజమాన్య ధ్రువీకరణ బాధ్యత రెవెన్యూ దే
- భూసమస్యలకు ఈ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం
: జగనన్న భూహక్కు-భూరక్ష పై మంత్రుల కమిటీ సమీక్ష
అమరావతి (ప్రజా అమరావతి):
సచివాలయంలోని మూడో బ్లాక్ లో శుక్రవారం రాష్ట్ర ఇంధన, అటవీ, గనులు, పర్యావరణశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జగనన్న భూహక్కు-భూరక్ష పథకంపై మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు శ్రీ అజేయ్ కల్లాంతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు భూసర్వేకు సంబంధించి జరుగుతున్న ప్రగతిని మంత్రుల కమిటీకి వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 52 డ్రోన్ లతో సమగ్ర భూసర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నామని అధికారులు వివరించారు. త్వరలోనే సర్వే ఆఫ్ ఇండియా, ఎపి ప్రభుత్వం, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా మొత్తం 172 డ్రోన్ లను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు 2149 గ్రామాల్లో డ్రోన్ సర్వే జరిగిందని తెలిపారు. అలాగే 756 గ్రామాలకు గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయ్యింది. 535 గ్రామాల్లో గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తి చేశామని తెలిపారు. వీటికి సంబంధించి 9283 అప్పీళ్ళు ప్రజల నుంచి అందాయని, వాటిల్లో 8935 అప్పీళ్ళను పరిష్కరించడం జరిగిందని అన్నారు. సర్వే చేసిన 51 గ్రామాల పరిధిలో సర్వే రాళ్ళను పాతడం కూడా వేగంగా జరుగుతోందని అన్నారు. ఇప్పటి వరకు 18,487 సర్వే రాళ్ళను పాతడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు 13 జిల్లా కేంద్రాల్లో ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా సర్వే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెడుతున్నామని, ఈ జూన్ నాటికి మరో 13 జిల్లా కేంద్రాల్లో ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఆగస్టు నాటికి డ్రోన్ సర్వే ప్రారంభమవుతుందని, అప్పటికి రాష్ట్రం మొత్తం మీద 100 ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 123 అర్బన్ స్థానిక సంస్థలు ఉన్నాయని అన్నారు. వీటిల్లో 5548.90 చదరపు కిలోమీటర్ల పరిధఙలో 30 లక్షల నిర్మాణాలు, 7 లక్షల మేర ఖాళీ స్థలాలు ఉన్నాయని తెలిపారు. ఈ 37 అసెస్ మెంట్ లకు సర్వే నిర్వహించాల్సి ఉందని అన్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెంలో మున్సిపాలిటీలోని రెండు వార్డుల్లో సర్వే పూర్తయ్యిందని, దానిని ఆధారంగా అర్బన్ ప్రాంతాల్లో సర్వే ప్రక్రియను కొనసాగిస్తామని వివరించారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గ్రామకంఠంలో నిబంధనల మేరకు ఓనర్ షిప్ సర్టిఫికేట్ లను రెవెన్యూ డిపార్ట్ మెంట్ ద్వారా జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అటవీభూముల సరిహద్దులపై ఇప్పటికే వివరాలను తీసుకున్నామని, మరో పదిహేను రోజుల్లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి, భూముల హద్దులను గుర్తిస్తామని అధికారులు వెల్లడించారు.
అనంతరం మంత్రులు మాట్లాడుతూ సీఎం శ్రీ వైయస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ సర్వేను పకడ్భందీగా నిర్వహించాలని కోరారు. భవిష్యత్తులో ఎటువంటి భూ వివాదాలు లేకుండా ఈ సర్వే మంచి పరిష్కారాన్ని చూపుతుందని అన్నారు. అర్భన్, రూరల్ ప్రాంతాల్లో నివాసాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయభూములు, అర్భన్ ప్రాంతంలోని ఖాళీ భూములకు సంబంధించిన సమగ్ర సమాచారంను అత్యంత శాస్త్రీయంగా సర్వే ద్వారా నిర్ధారించాలని కోరారు. అలాగే అటవీభూములకు సంబంధించి గతంలో జరిగిన అవకతవకలను కూడా జగనన్న భూహక్కు-భూరక్ష ద్వారా సరిదిద్దాలని సూచించారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సంయుక్త సమావేశాలు నిర్వహించి, నిర్ధిష్టంగా సరిహద్దులను గుర్తించాలని, ఎక్కడైనా ఆక్రమణలు జరిగినట్లు తేలితే వెంటనే వాటిపై చర్యలు తీసుకోవలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో సీసీఎల్‌ఏ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (హౌసింగ్) అజయ్ జైన్, పిఆర్ &ఆర్డీ కమిషన్ కోన శశిధర్, ప్రవీణ్ కుమార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, పిసిసిఎఫ్ చిరంజీవి ఛౌదరి, అడిషనల్ కమిషన్ (డిటిసిపి) వి.సునీత తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment