రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
ఫిర్యాదు పరిష్కారం స్థాయి వివరాలు ప్రజలకు తెలియచేయాలి
ఈరోజు 27 దరఖాస్తులు అందాయి
- కె. దినేష్ కుమార్
ప్రజల సమస్యల పరిష్కారం ఏ స్థాయి లో ఉందో సంబందించిన వారికి వివరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ స్పష్టం చేశారు.
సోమవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, స్పందనలో ఈరోజు ప్రజల నుంచి 27 ఫిర్యాదులు అందాయన్నారు. స్పందన లో వొచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం వ్యక్తిగత సమస్యలకు , టిడ్కో ఇళ్లకోసం, సిడి ఆర్. బాండు తదితరాలకు చెందినవని ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రతీ ఫిర్యాదుకి సంబంధించిన సమస్య పరిష్కా రం కోసం ప్రత్యేక దృష్టి చూపాలన్నారు. ఒకవేళ సంబందించిన సమస్య కి రాష్ట్ర స్థాయి నుంచి వివరణ, అనుమతి తీసుకొనవలసి ఉంటే ఆవిషయాన్ని సంబంధించిన అర్జీదారునికి తెలియపర్చాలన్నారు. అనర్హులకు పథకాలు అమలు సాధ్యం కాదనే విషయం స్పష్టం గా తెలియ చేయాలన్నారు. వాస్తవ అర్హులకు సంబంధించిన విభాగాల అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని , సిబ్బందికి తగిన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు అర్హులకు సమస్య పరిష్కారం చూపేలా నిర్ణయం తీసుకోవాలన్నారు.
స్పందన కార్యక్రమం సంబంధించిన నగర పాలక సంస్థ అధికారులు,అదనపు మునిసిపల్ కమీషనర్ పి. వి. సత్యవేణి, ఇంజనీరింగ్ ఇతర అధికారులు పాండురంగారావు, సూరజ్ కుమార్, సాంబశివరావు, డా.వినూత్న, , వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment