ప్రైవేటు డైరీలలో రైతులు మోసానికి గురికాకుండా చూడాలన్న సీఎం.

 

అమరావతి (ప్రజా అమరావతి);


*అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.* 


*అగ్రి ఇన్‌ఫ్రా కింద చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు*

అగ్రి ఇన్‌ఫ్రా కింద సుమారు రూ.16,404.86 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టులు.

వ్యవసాయ అనుబంధశాఖల్లో సుమారు 30 రకాల పనులు చేపడుతున్నామన్న అధికారులు.

వ్యవసాయ, అనుబంధరంగాల్లో మౌలికసదుపాయాల కల్పన పనులు యుద్ధప్రాతిపదికన ముందుకు సాగాలన్న సీఎం

అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ శాఖలో మూడు రకాల నిర్మాణాలు చేపడుతున్నామన్న అధికారులు

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,200 ప్రాంతాల్లో గోదాములు, కోల్డ్‌ రూములు, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ఫాంలు నిర్మాణం


ఇప్పటికే తొలిదశలో 1165 గోదాములు, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫాంల నిర్మాణానికి సంబంధించి స్ధలాల ఎంపిక పూర్తైందన్న అధికారులు.

510 చోట్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయన్న అధికారులు.

యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలన్న సీఎం.

ఏడాదిలోగా మొత్తం నిర్మాణాలను పూర్తి చేయాలన్న సీఎం.

అందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకుని.. పనులు పూర్తి చేయాలన్న సీఎం

ఆర్బీకేలను ఆంధ్రప్రదేశ్‌ మానసపుత్రికగా ప్రపంచ వేదికలమీదే మాట్లాడుకుంటున్న పరిస్థితి 

ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే స్ధాయిలో ప్రైమరీ ప్రాససింగ్, డ్రైయింగ్‌ ప్రాట్‌ఫాంలు, గోదాములు, కోల్డ్‌రూంలు నిర్మించాల్సిన అవసరం ఉంది.

ఆర్బీకేలు సమర్థవంతంగా పనిచేయాలంటే వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు చాలా కీలకమైనవి:

ఏడాదిలోగా కచ్చితమైన ఫలితాలు కన్పించాలన్న సీఎం


*వైయస్సార్‌  యంత్ర సేవా పథకంపైనా సీఎం సమీక్ష*

ప్రతి ఆర్బీకేలో కూడా యంత్రసేవా పథకం ఉండాలన్న సీఎం.

ప్రతి త్రైమాసికానికి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఆమేరకు ప్రతి ఆర్బీకేకు, క్లస్టర్‌కు యంత్రాలు అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం.

అంతేకాకుండా రైతులకు వ్యక్తిగత సబ్సిడీపై అందించే వ్యవసాయ పరికరాలపైనా దృష్టిపెట్టాలన్న సీఎం


*కిసాన్‌ డ్రోన్స్‌ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష*

మొదటగా 2వేల డ్రోన్‌ యూనిట్లు.

ఇందులో భాగంగా తొలుతగా 2వేల ఆర్బీకేల దృష్టి.

అవసరమైన మేరకు డ్రోన్‌ యూనిట్లను పెంచుకోవాలన్న సీఎం

ప్రతి మండలంలో కనీసం 4 ఆర్బీకేలను లక్ష్యంగా చేసుకోవాలన్న సీఎం

ఆర్బీకేల పరిధిలో డ్రోన్‌ పైలట్లను గుర్తించాలన్న సీఎం

రైతుల్లో సైన్స్‌ గ్రాడ్యుయేషన్, ఇంటర్‌ సైన్స్‌ గ్రూపు చదువుకున్న రైతుల గుర్తింపు

నానో యూరియా(ఫెర్టిలైజర్స్‌) వాడకంపై కూడా దృష్టిపెట్టాలన్న సీఎం

ఉద్యానపంటల ఉత్పత్తులు అధికంగా ఉన్నచోట డ్రై గోదాములు నిర్మాణానికి ప్రతిపాదనలు

డిసెంబరు 22 నాటికి మొదలుపెట్టి మార్చి 2023 నాటికి పూర్తి చేస్తామన్న అధికారులు.


*పశుసంవర్ధకశాఖ సీఎం సమీక్ష.*

రెండు దశల్లో వైయస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ –అంబులెన్స్‌లు ప్రారంభించడానికి సన్నద్ధంగా ఉన్నామన్న అధికారులు.

తొలిదశ కింద 175 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయన్న అధికారులు.

రెండో దశలో మరో 165 అంబులెన్స్‌లు సిద్ధం చేస్తామన్న అధికారులు.


*జగనన్న పాలవెల్లువ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష.*


త్వరలో అనకాపల్లి జిల్లాలో అమూల్‌ జగనన్న పాలవెల్లువ ప్రాజెక్టు ప్రారంభం.

అనకాపల్లి జిల్లాలో 191 గ్రామాల్లో ప్రారంభం కానున్న పాలసేకరణ

మరో రెండు నెలల్లో ఇప్పటికే జగనన్న పాలవెల్లువ అమలవుతున్న జిల్లాలతో పాటు మొత్తం 1,282 గ్రామాల్లో ప్రారంభం కానున్న పాలసేకరణ.

ప్రాధాన్యతా క్రమంలో బీఎంసీ యూనిట్ల నిర్మాణం.

1184 బీఎంసీలు, 2388 ఏంఎసీల నిర్మాణం.

ప్రైవేటు డైరీలలో రైతులు మోసానికి గురికాకుండా చూడాలన్న సీఎం. 


పాలసేకరణ, వెన్న శాతం నిర్ధారణలో కచ్చితమైన ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.

జగనన్న పాలవెల్లువ కార్యక్రమాల ద్వారా ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు లబ్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం


ఆక్వా ఫీడ్‌ రేట్లపై నిరంతర పర్యవేక్షణ చేయాలన్న సీఎం

రైతులకు అందుబాటులోఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

క్షేత్రస్థాయిలో ఆర్బీకేల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని ఆమేరకు చర్యలు తీసుకోవాలన్న సీఎం

ఆర్బీకేల్లో ఆక్వా అసిస్టెంట్లు ఉన్నారు, వారి నుంచి క్షేత్రస్థాయిలో సమస్యలను నివేదికలు రూపంలో తీసుకుని వాటిపై తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.

ఆక్వా రైతు ఇబ్బంది పడితే.. అల్టిమేట్‌గా ఆక్వా ఉత్పత్తులపై ప్రభావం పడుతుందని.. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం 


*ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణంపై సమీక్ష.*

ఫేజ్‌ –1లో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్లు డిసెంబర్‌ నాటికి పూర్తవుతాయన్న అధికారులు.


ఫేజ్‌ –2లో చేపట్టనున్న మిగిలిన 5 షిఫింగ్‌ హార్బర్ల (బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, వాడరేవు, కొత్తపట్నం) పనులు ఈ జులైలో ప్రారంభిస్తామన్న అధికారులు.

–  వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం.



ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం వీ యస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్‌రెడ్డి, పుడ్‌ ప్రాససింగ్‌ కార్యదర్శి ఎం కె మీనా, అగ్రికల్చర్‌ కమిషనర్‌ సి హరి కిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్‌ ఎస్‌ ఎస్‌ శ్రీధర్, మార్క్‌ఫెడ్‌ ఎండీ పీ ఎస్‌ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్‌ కె కన్నబాబు, ఏపీడీడీసీఎఫ్‌ డైరెక్టర్‌ అహ్మద్‌ బాబు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments