ఇండ్ల నిర్మాణాలను వేగవంతం

 



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


ఇండ్ల నిర్మాణాలను వేగవంతం


చేసి లక్ష్యాలను సాధించడానికి వివిధ స్థాయి ల్లో ఉన్న వాటిని తదుపరి స్టేజీ కి తీసుకుని వెళ్ళాలని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు.



శనివారం అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో బిక్కవోలు, అనపర్తి మండలాల  గృహ నిర్మాణ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జేసీ సమీక్ష చేస్తూ, లే అవుట్ లలో పనులు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ఇప్పటికీ స్థలాలు కేటాయించిన లబ్దిదారులచే ఇంటి నిర్మాణం చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇంటింటి ప్రచారం ద్వారా అవగాహన కల్పించాలన్నారు. 


బిక్కవోలు  మండలంలోని బిక్కవోలు 1, బిక్కవోలు 2 హౌసింగ్‌ లేఅవుట్‌లను జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలించారు. అలాగే అనపర్తి మండలంలోని దుప్పలపూడి, కొత్తూరు, ఎల్‌ఎన్‌ పురం హౌసింగ్‌ లేఅవుట్‌లను జాయింట్‌ కలెక్టర్‌ తనిఖీ చేశారు.




డ్వామా పిడి పి జగదాంబ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, మండల ప్రత్యేక అధికారి, తహశీల్దార్, ఎంపిడివో, హౌసింగ్ డి ఈ లు, ఏ ఈ లు, ఫీల్డ్ కార్యదర్శులు పాల్గొన్నారు.




Comments