రాజ్యసభ స్థానాలకు రెండో సెట్టు నామినేషన్ పత్రాలు దాఖలు

 రాజ్యసభ స్థానాలకు రెండో సెట్టు నామినేషన్ పత్రాలు దాఖలు 


అమరావతి, మే 31 (ప్రజా అమరావతి): రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి వై.ఎస్.ఆర్.సి.పి.కి చెందిన ముగ్గురు  అభ్యర్థులు రెండో సెట్టు నామినేషన్ పత్రాలను మంగళవారం దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి రోజైన మంగళవారం అమరావతి అసెంబ్లీ భవనంలో రిటర్నింగ్ అధికారి మరియు రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి  పి.వి. సుబ్బారెడ్డికి వీరు రెండో సెట్టు నామినేషన్ పత్రాలను అందజేశారు. రాజ్యసభ సభ్యుల ఎన్నికలో పోటీచేసే వై.ఎస్.ఆర్.సి.పి.కి చెందిన అభ్యర్థులలో ఆర్.కృష్ణయ్య రెండో సెట్టు నామినేషన్ పత్రాలను నేరుగా రిటర్నింగ్ అధికారికి అందజేయగా మరియు ఎస్.నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు  తరుపున వరుసగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు రెండో సెట్టు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

 

Comments