కొల్లిపర (ప్రజా అమరావతి); మాజీ మంత్రి ఆలపాటి. రాజేంద్రప్రసాద్ సమక్షంలో తుములూరు గ్రామంలో వైఎస్సార్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో
ఈరోజు మరెడ్డి. సుధాకర్ రెడ్డి, అవుతు. సంజీవరెడ్డి, ఈద. సుబ్బారెడ్డి లు చేరినారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ లో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రతి కార్యకర్త కు ఎల్లప్పుడూ పార్టీ అండదండలు ఉంటాయని తెలిపారు. ఈ ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు అని తెలిపారు. రాబోయే రోజుల్లో వైయస్సార్ సిపి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వంగా సాంబిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కోటిరెడ్డి, ఎన్టీఆర్ కోటిరెడ్డి, కొల్లి. కోటిరెడ్డి , కంచర్ల, అమృత రాజు, అరె. శేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
addComments
Post a Comment