తాడేపల్లి (ప్రజా అమరావతి); మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నిరుపేద కూలీలను ఉద్దేశించి ప్రారంభించిన పథకం. ఈ పథకం ద్వారా మన రాష్ట్ర౦లో దాదాపు 60 లక్షల మంది లబ్ది పొందుతున్నారు. రాష్ట్ర౦లోని 26 జిల్లాల్లో ఈ పథకం కూలీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తతో అమలుచేస్తోంది.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అంటే 2022-23లో మదర్ శాంక్షన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాలకు గానూ మొదటి విడతగా రూ. 929.20 మంజూరు చేయగా, రెండో విడతగా రూ.228.91కోట్లను మంజూరు చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. కాగా ఇప్పటివరకు రూ. 685 కోట్లు రోజువారీ వేతన ఎఫ్.టి. ఓల అప్ లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ అయ్యాయని, మిగిలిన మొత్తాలు మరో మూడు నాలుగు రోజుల్లో వేతనదారుల ఖాతాలకు జమ అవుతాయని కమిషనర్ కోన శశిధర్ వివరించారు.
addComments
Post a Comment