బడి రూపురేఖలను నాడు - నేడు ద్వారా మారుస్తున్న ము: జిల్లా కలెక్టర్

 బడి రూపురేఖలను నాడు - నేడు ద్వారా   మారుస్తున్న ము:  జిల్లా కలెక్టర్


పుట్టపర్తి, మే 25 (ప్రజా అమరావతి):  బడి రూపురేఖలను నాడు- నేడు కార్యక్రమం ద్వారా మారుస్తామని జిల్లా కలెక్టర్  బసంత కుమార్  పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం సమయంలో   పుట్టపర్తి రూరల్ పరిధిలోని మంగళకర ఎడ్యుకేషన్ ట్రస్ట్  ఆవరణలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో  మనబడి నాడు- నేడు కింద పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం  ద్వారా మొదటి దశలో బడులు రూపురేఖలు మార్చడం జరిగింది రెండో దశలో జిల్లాలో 575 ప్రభుత్వ పాఠశాలను రూపురేఖలను మార్చడానికి నాడు - నేడు కార్యక్రమం ద్వారా సంబంధిత ఇంజనీర్లు పనులు వేగవంతం చేయాలని  తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కొరకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని  తెలిపారు.  పాఠశాలలో మంచి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని. ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష ఫలితాలు ముందువరుసలో ఉన్నాయని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ వారి  వారిపిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని  తెలిపారు ప్రతి గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాడు నేడు కార్యక్రమం ద్వారా పనులు వేగవంతం చేయాలని సంబంధిత కలెక్టర్లకు సూచించారు. ఈ తరం పిల్లలు  ఎదిగిన తరువాత రాబోయే కాలంలో అప్పటి ప్రపంచంలో రాబోయే సవాళ్లను  ఆత్మస్థైర్యం తో ఎదుర్కునేందుకు వారి ఆహారంలో మార్పులు. వారికిచ్చే డ్రెస్ లలో   షూస్, పుస్తకాల వరకూ  ప్రభుత్వం అందజేస్తూ ఉన్నదని తెలిపారు నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్లో పిల్లల సంఖ్య పెరిగింది.  నాడు నేడుస్కూల్ లో ఏర్పాటు చేసిన పనులు  నిర్వహణపై కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలి . అధికారులు, ఇంజనీర్లు, మండల విద్యాశాఖ అధికారులు అందరూ కలిసికట్టుగా

నాడు నాడు నేడు పనుల ప్రాముఖ్యత మరియు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని  పాఠశాలలకు సేవచేసే భాగ్యాన్ని ఉపయోగించుకోవాలని    తెలిపారు ఫీల్డ్ ఇంజనీర్లు పాఠశాలను సందర్శించినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి కావున తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్ ఉండాల్సిందిగా  అధికారులను  ఆదేశించారు

పనులను సకాలంలో పూర్తి చేసి విద్యార్థులకు నూతన విద్యా సంవత్సర విద్యా కానుకగా ఇవ్వాలని  తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వ శిక్ష అధికారి తిలక్ విద్యా సాగర్, డి ఈ ఓ జి.నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ సి గోపాల్ రెడ్డి, ఎస్ సి పి ఆర్, సంబంధిత శాఖ ఇంజనీర్లు, ఎం ఈ ఓ లు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Comments