నేను నిప్పులాంటి మనిషిని.. నన్నెవరూ ఏమీ చేయలేరు : చంద్రబాబు నాయుడు.
కర్నూలు (ప్రజా అమరావతి): తాను తప్పు చేయనని.. నిప్పులాంటి మనిషినని..ఎవరెన్ని కుట్రలు చేసినా తననేమీ చేయలేరని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కర్నూలు వేదికగా వ్యాఖ్యానించారు. గురువారం నాడు ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యకర్తలతో బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాము కన్నెర్ర చేస్తే సీఎం వైఎస్ జగన్ తట్టుకోలేరని ఒకింత హెచ్చరించారు. కర్నూలులో టీడీపీకి చెందిన ఫ్లెక్సీలు తొలగించి వైసీపీ జెండాలు పెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో వేధింపులు, అప్పులు, బాదుడే బాదుడు అని వ్యాఖ్యానించారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
addComments
Post a Comment