రాజమహేంద్రవరం, (ప్రజా అమరావతి);
అక్రమ మద్యం వ్యాపారం చట్టవిరుద్దమని అటువంటి వారికి సరైన జీవనోపాధి కల్పించడం ద్వారా వారి కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం తో మార్పుకి శ్రీకారం చుట్టే ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదేశించారు.
శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, మండల అభివృద్ధి, డిఆర్డిఏ, నైపుణ్యాభివృద్ధి, ఆర్సెట్టి అధికారులతో ఎసిపి ఏ. రమాదేవి తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, నాటు సారా (ఐ డి లిక్కర్) వ్యాపారం చేసే వ్యక్తులపై బైండ్వోవర్కేసులు నమోదు చేయడం ద్వారా మార్పుతీసుకుని రావ
డానికి సంబందించిన శాఖాధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. జీవనోపాధి దిశగా ఆయా కుటుంబాల్లో మార్పు కి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని స్పష్టం చేశారు. సుస్థిరమైన ఆర్థిక సాధికారకత కోసం కొత్త ఆలోచనలు అమలు దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ సారా వ్యాపారం చేసే వారిపై కేసులు నమోదు చెయ్యడం వలన వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొనే ఇబ్బందులు, రానున్న తరాలపై వాటి పై ప్రభావం అవగాహన కల్పించాలన్నారు. పరివర్తన కార్యక్రమాలను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ఐదు మండలాలు పరిధిలో ఉన్న ఏడు గ్రామాల్లో ఐ డి లిక్కర్ వ్యాపారం చేసే మాఫియా డబ్బు ప్రలోభాల చూపెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సంఘ వ్యతిరేక చర్య అని తెలిసి కూడా ప్రలోభాలకు ఆశపడడం ద్వారా సంబంధించిన వ్యక్తులు శిక్షకు గురి అవుతున్నారన్నారు. ఆయా కుటుంబాలకి ఆసక్తి ఉన్న రంగంలపై అధ్యయనం చేసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. జిల్లాలో ఐదు మండలాల పరిధిలోని ఏడు గ్రామాలలో నాటుసారా (ఐడి లిక్కర్) వ్యాపారం జరుగుతోందన్నారు. రఘునాథ పురం, మధురలంక, చిక్కాల, దొంతమురు, కవల గొయ్యి, పిడిం గొయ్యి, వెంకటనగరం గ్రామాల్లో గుర్తించిన కుటుంబాలపై ఇప్పటికే కేసులు నమోదు చేశామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం, వినియోగం తగ్గించే లాగా ఎన్నో సంస్కరణలు చేపడుతున్నారు. అటువంటి వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా పని చేయాల్సి ఉందన్నారు. జిల్లాను రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలిపేందుకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేద్దామని కలెక్టర్ కోరారు. గ్రామాలలో అక్రమ సారా వ్యాపారం చేసేవారి సమాచారం తెలుసుకునేందుకు వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేపట్టాలన్నారు. తాహసిల్దార్లు, ఎంపీడీవోలు ఇతర అధికారులు, వొచ్చే శనివారం నాటికి సమగ్ర నివేదిక తీసుకొని రావాలన్నారు.
ఎడిషనల్ సి పి/ జె.డి (ఎస్ ఈ బి) ఏ రమాదేవి మాట్లాడుతూ అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టేందుకు పరివర్తన కార్యక్రమాలను గ్రామాలలో చేపట్టడం జరిగిందన్నారు. నాటుసారా వ్యాపారం నిషిద్ధమని అటువంటి వ్యాపారం చేసినా, ప్రోత్సహించిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి అపరాధ రుసుము వసూలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి నాటుసారా వినియోగాన్ని సమూలంగా నిర్మూలించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈదిశగానే ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పలుమార్లు మండల స్థాయి అధికారులు పరివర్తన కార్యక్రమాలను చేపట్టామన్నారు. యువతను కూడా ఈ వ్యాపారం వైపు మళ్లీ చడం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. నాటుసారా తాగడం వల్ల వారి జీవిత కాల ప్రమాణం తగ్గిపోతోందని, కుటుంబాలు నిరాదరణకు గురి అవుతున్నాయన్నారు. జీవనోపాధి కి ఆయా గ్రామాల్లో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
ఈ సమావేశంలో రాజమహేంద్రవరం రూరల్, అర్బన్, రాజానగరం, రంగంపేట, కొవ్వూరు, చాగల్లు మండల తహాశీల్దార్లు, ఎంపీడీఓ లు, డి ఆర్ డి ఎ, ఎపి నైపుణ్యాభివృద్ధి, ఆర్సెట్టి, ఎక్సైజ్ లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment