టిడ్కో తొలి ఫేజ్ లో ఇళ్లను జూన్ నాటికి, రెండవ ఫేజ్ లోని ఇండ్లను డిసెంబర్ నాటికీ లబ్ధిదారులకు అప్పగించాలి

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


జిల్లాలో టిడ్కో తొలి ఫేజ్ లో ఇళ్లను జూన్ నాటికి, రెండవ ఫేజ్ లోని ఇండ్లను డిసెంబర్ నాటికీ లబ్ధిదారులకు అప్పగించాలి



 జిల్లా కలెక్టర్ డా. మాధవీలత 



జిల్లాలో పట్టణ ప్రాంతంలోని ఇళ్లు లేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు రెండు దశల్లో టిడ్కో  గృహాలను అప్పగించేందుకు పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ డా. కె.మాధవిలత  స్పష్టం చేశారు. 


బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో టిడ్కో గృహాలపై హౌసింగ్, టిడ్కో అధికారులతో సమావేశం నిర్వహించారు. 


  ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ,  జిల్లాలో రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు పట్టణ ప్రాంతంలోని అర్హులైన పేద, మధ్య తరగతి కుటుంబాలకి తొలి దశలో 3,424, రెండో దశలో 4,032 మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ళు కేటాయింపులు జరపాల్సి ఉందన్నారు. తొలిదశలో 300 ఎస్ ఎఫ్ టి ఇళ్ళు 1824 ;  365 ఎస్ ఎఫ్ టి ఇళ్ళు 672 ; 400 ఎస్ ఎఫ్ టి ఇళ్ళు 928 కేటాయింపులు జరుప వలసి ఉన్నాయన్నారు. వాటిని 2022 జూన్ నాటికి గృహ ప్రవేశాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. రెండో దశలో  300 ఎస్ ఎఫ్ టి ఇళ్ళు 2272 ;  365 ఎస్ ఎఫ్ టి ఇళ్ళు 528 ; 400 ఎస్ ఎఫ్ టి ఇళ్ళు 1712 కేటాయింపులు డిసెంబర్ చివరి నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు.  



తొలుత ఫేజ్ 1 మరియు 2 లలో టిడ్కో ద్వారా  రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 6304 ఇళ్ళు, కొవ్వూరు పరిధిలో 480 ఇళ్లు, నిడదవోలు పరిధిలో 1152 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. 



సమావేశం లో హౌసింగ్ డి ఈ లు జీ. నాగేశ్వరీ , ఎఈ లు పి సూర్యకుమారి, పి  అనంతలక్ష్మి, తదితరులున్నారు.




Comments