జిల్లావ్యాప్తంగా 2,63,526మంది రైతు కుటుంబాలకు రూ. 197.64 కోట్లు మంజూరు*
*మీటనొక్కి నిదులు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి*
రైతుకు రైతు భరోసా కేంద్రాలు రైతు కార్యాలయాలుగా రూపుదిద్దుకుంటున్నాయి
జిల్లా కలెక్టర్
రైతు దేశానికి వెన్నెముక : స్థానిక ఎమ్మెల్యే
పుట్టపర్తి, మే 16 (ప్రజా అమరావతి): రైతుకు రైతు భరోసా కేంద్రాలు రైతు కార్యాలయాలుగా రూపుదిద్దుకుంటున్నాయి అని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ పేర్కొన్నారు. సోమవారం పుట్టపర్తి లోని సాయి ఆరామం లోని రాష్ట్ర ప్రభుత్వం వై.ఎస్.ఆర్.రైతుభరోసా - పి.ఎం.కిసాన్ పథకం కింద రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు ఇస్తున్న నాల్గవ విడత ఆర్ధిక సహాయాన్ని ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఏలూరు జిల్లా గణపవరం గ్రామం నుండి మీటనొక్కి నిదులు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో సోమవారం పుట్టపర్తి లోని సాయి ఆరామం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,63,526 మంది రైతులు, కౌలు రైతులు, అటవీభూముల సాగుదారులకు 2022 - 23 సంవత్సరానికి నాల్గవ విడత సహాయం కింద రూ.197.64కోట్లు వారి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేయడం జరిగిందని ఆయన తెలిపారు. రైతు ఆర్థికంగా అభివృధి చెందాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రైతుకు రైతు భరోసా కేంద్రాలు రైతు కార్యాలయాలుగా రూపు దిద్దుకున్నాయన్నారు. రైతులు చేస్తున్న సాగుకు అత్యాధునిక పరికరాలతో సాగు చేయడం ద్వారా పండించడం సులభతరం, దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉందన్నారు. శాస్త్రజ్ఞులు అందిస్తున్న సలహాలు సూచనలు పాటిస్తే మంచి లాభాలు పొందవచ్చన్నారు.
మూడు విడతల్లో భరోసా....*
వైయస్సార్ రైతు భరోసాగా ప్రతి సంవత్సరం రూ.13,500 మూడు విడతల్లో ప్రతి ఏటా ప్రతి ఒక్క రైతు కుటుంబానికి, కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేస్తున్న రైతులకు, ఆర్వోఎఫ్‌ఆర్(అటవీభూములు) సాగు చేస్తున్న రైతులందరికీ ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది వరుసగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో ఏడాది మళ్లీ వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా జిల్లాలో సుమారు 198 కోట్ల రూపాయలు ఈరోజు ఆయా రైతుల బ్యాంక్ ఖాతాలు జమ చేయడం జరిగిందని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం వ్యవసాయం పై ఆధారపడిన రాష్ట్రమని, వ్యవసాయానికి కావాల్సిన సాగునీరు, ఇతర సదుపాయాలు అందిస్తున్న వ్యక్తి మనకు ముఖ్యమంత్రి గా ఉండడం, విద్యా, వైద్య, వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టమన్నారు. మనసున్న ముఖ్యమంత్రి పంటలకు రాయితీలు కల్పిస్తూ రైతు లేనిదే రాజ్యం లేదని బలంగా నమ్ముతూ.. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలను స్ధాపించి విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ ప్రతి అడుగులోనూ రైతన్నలకు కొండంత అండగా ఉంటూ రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ.... వ్య
వసాయ సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా రాష్ట్రం నిలిచిందని వివరించారు. అనంతరం మెగా చెక్కును రైతులకు అందజేశారు.
ఏలూరు జిల్లా గణపవరంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన సందేశాన్ని అందరూ లైవ్లో తిలకించారు. అనంతరం రైతులకు నమూనా చెక్కును అందజేశారు. ఎరువులపై రైతులకు అవగాహన కల్పించే కరపత్రాలు ఆవిష్కరించారు. వ్యవసాయ అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్ ను తిలకించారు. జె.డి వ్యవసాయ శాఖ శివ నారాయణ, పూడా వైస్ చైర్మన్ లక్ష్మీ నరసమ్మ, పుట్టపర్తి మున్సిపాలిటీ చైర్మన్, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన అధికారులు, జిల్లాకు సంబంధించిన వివిధ మండలాల రైతులు తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment